234 కిలోమీటర్ల స్పీడ్.. ప్రాణాలకు తెగించిన అజిత్!
తమిళ సూపర్ స్టార్ అజిత్ కేవలం సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా హీరోనే. డేరింగ్, డాషింగ్‌తో మోటార్ బైక్స్, కార్లతో విన్యాసాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకొంటారు. అయితే తాజాగా ఆయన ప్రాణాలకు తెగించి అత్యంత వేగంగా కారును నడిపి ఫ్యాన్స్‌ను కొంత సేపు టెన్షన్‌లో నెట్టినప్పటికీ.. ఆయన ఆ వాహనాన్ని చాలా కూల్‌గా నడిపిన తీరు మాత్రం అభిమానులను కాలర్ ఎగిరేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
స్టార్ హీరో అజిత్ స్వతహాగా రేసర్. ఫార్మూలా 1 స్థాయి బైక్ రేసర్. ఎన్నోసార్లు రేసింగ్ పోటీల్లో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. కేవలం రియల్ లైఫ్‌లోనే కాకుండా సినిమాలో మోటార్ బైక్ యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను ఆకట్టుకొంటారు. అయితే తాజాగా ఆయన మరోసారి రోడ్డుపై తన ధైర్య సాహసాలు ప్రదర్శించారు.

తాజాగా హైవేపై అజిత్ కారులో ప్రయాణించారు. ఆయన వేగంగా వాహనాలు నడపడంతో ఆయనకు ఆయనే సాటి. తాను ఎంత వేగంగతో కారును నడుపుతారనే విషయం గురించి స్పష్టంగా లైవ్‌లో చూపించారు. కారును రోడ్డుపై పరుగులు పెట్టిస్తూ.. వీడియోను ప్రదర్శించారు.
అజిత్ కారులో బెల్ట్ పెట్టుకొని ఎలాంటి టెన్షన్ లేకుండా ఎక్సలేటర్‌పై కాలు పెట్టి స్పీడ్‌గా తొక్కుతూ వాహనాన్ని పరుగులు పెట్టించారు. స్పీడ్ మీటర్‌పై 225 నుంచి 234 వరకు స్పీడ్‌ను పెంచి స్వయంగా ఇది నా వేగం అంటూ లైవ్‌లో చూపించారు. కారు స్పీడ్‌గా తొలుతుంటే పక్కనే ఉన్న వ్యక్తి వీడియో తీస్తూ చిల్ అయ్యారు.
అయితే అజిత్ స్పీడ్ చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత స్పీడ్‌లో ఏదైనా జరిగితే మేము తట్టుకోలేం. మీరు కాస్త స్పీడ్ తగ్గించండి అంటూ సోషల్ మీడియాలో అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అంత స్పీడ్ చూడటానికి బాగానే ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఊహించుకోలేం అని అన్నారు.
ఇదిలా ఉండగా, అజిత్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం విదాముయార్చి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నది. ఈ సినిమాను మాగిజ్ తిరుమెని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సుబాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా బ్రేక్ డౌన్ అనే సినిమా ఆధారంగా రూపొందుతున్నది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, త్రిషా కృష్ణన్, రెజీనా కసాండ్రా తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











