twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో సూర్యకు కరోనా పాజిటివ్.. భయపడకండి అంటూ ట్వీట్.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

    |

    తమిళ సూపర్ స్టార్ సూర్య కరోనావైరస్ బారిన పడిన సెలబ్రిటీల జాబితాలో చేరారు. తనకు కరోనా పాజిటివ్ అంటూ సూర్య తన సోషల్ మీడియా అకౌంట్‌ ట్విట్టర్ ద్వారా అభిమానులకు, ప్రేక్షకులకు వెల్లడించారు. అందరూ క్షేమంగా, జాగ్రత్తగా ఉండాలంటూ సూర్య ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు, సూర్య ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

     ఆకాశమే నీ హద్దురా హిట్ తర్వాత

    ఆకాశమే నీ హద్దురా హిట్ తర్వాత

    ఆకాశమే నీ హద్దురా (సూరారై పొట్రూ) చిత్ర విజయం తర్వాత దర్శకుడు పాండిరాజ్‌తో కలిసి ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరిలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ తనకు కరోనా వైరస్ పాజిటివ్ అంటూ ఫిబ్రవరి 7 అంటే ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు. ఈ సినిమా ప్రారంభం మరికొద్ది రోజులు వాయిదా పడే అవకాశం ఉంది.

     కరోనా పాజిటివ్ అని తేలడంతో

    కరోనా పాజిటివ్ అని తేలడంతో

    ఇక సూర్య ట్వీట్ చేస్తూ... ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలు చేయించుకొన్నాను. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో కోవిడ్ 19 నుంచి బయటపడటానికి చికిత్స పొందుతున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగున్నది. మీరంతా క్షేమంగా, జాగ్రత్తగా ఉండండి అంటూ సూర్య ట్వీట్‌లో పేర్కొన్నారు.

     సాధారణ పరిస్థితులు నెలకొనలేదు

    సాధారణ పరిస్థితులు నెలకొనలేదు

    ఇక కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోవడంతో ప్రజా జీవితం ఇంకా కష్టంగా ఉన్నట్టు అర్ధమవుతున్నది. సాధారణ జీవితం ఇంకా స్తంభించినట్టే కనిపిస్తున్నది. కానీ మనం భయానికి గురి కాకూడదు. కాబట్టి మనం ఇంకా సురక్షితంగా, క్షేమంగా ఉండటానికి ప్రయత్నించాలి. నా ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకొంటున్న డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు అంటూ తన ట్వీట్‌లో తెలిపారు.

    సూర్య కెరీర్ ఎలా ఉందంటే

    సూర్య కెరీర్ ఎలా ఉందంటే

    ఆకాశమే నీ హద్దురా చిత్ర సక్సెస్ తర్వాత పలువురు ప్రముఖ డైరెక్టర్లతో సూర్య సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. పాండిరాజ్‌తోపాటు వెంట్రీమారన్‌తో వాడి వాసల్ చిత్రంలో చేస్తున్నారు. అలాగే గౌతమ్ మీనన్‌తో నవరస అనే చిత్రాన్ని, హరితో మరో సినిమాను ప్లాన్ చేశారు.

    English summary
    Tamil Super Star Suriya tested Corona Virus Positive. He tweeted and announced his health condition thru twitter on Sunday night. Suriya revealed that he was fine and undergoing treatment. He thanks doctors, Medical staff who are treating the him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X