Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. రజనీ యూటర్న్‌తో తెరపైకి ఇళయ దళపతి పార్టీ.. డిసెంబర్ 31న జయలలిత సమాధి వద్ద..
తమిళ రాజకీయాల నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ తప్పుకోవడంతో ఒక్కసారిగా కోలీవుడ్‌లో పరిస్థితులు చకచకా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు ఊగిసలాటను ప్రదర్శించిన సూపర్ స్టార్ విజయ్ తన రాజకీయ ప్రవేశానికి మెరుగులు దిద్దుతూ సన్నిహితులతో సంప్రదింపులు, చర్చలు జరపడం కోలీవుడ్ వర్గాల్లోనూ.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. ఇళయ దళపతి విజయ్ రాజకీయ ఎంట్రీపై చెలరేగుతున్న ఊహగానాలు ఇలా ...

మాస్టర్ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా
లాక్‌డౌన్ పరిస్థితులు అదుపులోకి వస్తున్న క్రమంలో హీరో విజయ్ ప్రస్తుతం తన సినిమా మాస్టర్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనావైరస్ పరిస్థితుల కారణంగా థియేటర్ల మూసివేతతో పలుమార్లు వాయిదా పడింది.

తమిళ సీఎం పళనిస్వామితో భేటి
ఇక లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో విజయ్ తన సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో ఈ చిత్రం జనవరి 16, 2021న రిలీజ్ చేయాలని ముహుర్తం నిర్ణయించారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ విషయంపై తమిళనాడు సీఎం పళనిస్వామితో కలిసి చర్చలు జరిపారు.

రజనీకాంత్ యూటర్న్‌తో
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో విజయ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. రజనీకాంత్ నిర్ణయించిన ముహుర్తానికే విజయ్ తన పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు వార్తలు వస్తున్నాయి.

డిసెంబర్ 31న జయలలిత సమాధి వద్ద
హీరో విజయ్ తన పార్టీ ఏర్పాటు ప్రకటన విషయం డిసెంబర్ 31వ తేదీన అమ్మ జయలలిత సమాధి వద్ద చేస్తారనే ఊహగానాలు జోరందుకొన్నాయి. 2021లో జరిగే ఎన్నికల్లో కరుణానిధి కుమారుడు అళగిరితో కలిసి డీఎంకే ఓటు బ్యాంకుకు గండి కొట్టే వ్యూహాలు పన్నుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల సీఎం పళనిస్వామితో కలిసి జరిపిన చర్చలు ఇందుకు బలాన్ని కలిగిస్తున్నాయి.

విజయ్‌పై తండ్రి పొలిటికల్ పార్టీ
గత కొద్ది నెలలుగా విజయ్ కుటుంబంలో రాజకీయపరమైన వ్యవహారాలు, వివాదాలు చోటుచేసుకొంటున్నాయి. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖరన్ తన కుమారుడి పేరుపై విజయ్ మక్కల్ ఇయక్కమ్ అనే పార్టీని ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయడం వివాదంగా మారింది. తన తండ్రి స్థాపించిన పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, ఒకవేళ తన అభిమానులు తన పేరును ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని విజయ్ హెచ్చరించారు.