Michaung Cyclon దటీజ్ అజిత్.. అమీర్ ఖాన్, విష్ణు విశాల్ ఆదుకొన్న తలా.. ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్

తమిళనాడు రాష్ట్రంలో మిగ్‌జాం తుఫాన్ విలయతాండవం సృష్టిస్తుంది. తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. విలాసవంతమైన ప్రాంతాలు, ప్రధాన రహదారులు వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. సినీ ప్రముఖులు నివసించే గేటెడ్ కమ్యూనిటీ రిసార్టులన్నీ జలాశయాలుగా మారాయి. ఈ క్రమంలో హీరో అజిత్ తన మనవత్వాన్ని ప్రదర్శించారు. ఈ వివరాల్లోకి వెళితే..

తమిళ హీరో విష్ణు విశాల్ నివసించే విల్లా కమ్యూనిటీ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. దాంతో దాదాపు 30 మంది వరదల్లో చిక్కుకుపోయారు. తాము వరదల్లో మంపులో చిక్కుకొన్నామని విష్ణు విశాల్ ట్వీట్ చేసి తెలియజేశారు. మా ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. కరెంట్, వైఫ్, మొబైల్ సర్వీసులు నిలిచిపోయాయని వెల్లడించారు.

Michaung Cyclon-Ajith

విష్ణు విశాల్ ట్వీట్ చూసిన తమిళనాడు ప్రభుత్వ అధికారులు, అగ్నిమాపక అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే మూడు బోట్లతో విశాల్ ఉండే విల్లా కమ్యూనిటీ ప్రాంతానికి వెళ్లారు. ఆ ప్రాంతం నుంచి అమీర్ ఖాన్‌తోపాటు విశాల్, కొందరు వృద్ధులను మూడు పడవల సహాయంతో తరలించారు.

అయితే అమీర్ ఖాన్, విష్ణు విశాల్, ఇతర కమ్యూనిటీ సభ్యుల కష్టాలు తెలుసుకొన్న అజిత్ వెంటనే స్పందించారు. వారందరికి తన ఇంటిలోను, ఇతర ప్రాంతాల్లోను ఆశ్రయం కల్పించారు. అజిత్‌తో కలిసి అమీర్ ఖాన్, విష్ణు విశాల్ ఫోటోకు ఫోజిచ్చారు.

విష్ణు విశాల్ తన ట్విట్టర్‌లో అమీర్ ఖాన్, అజిత్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేస్తూ ఓ మెసేజ్‌ను కూడా పెట్టారు. మా విల్లాను వరదలు ముంచెత్తిన పరిస్థితిని కామన్ ఫ్రెండ్ ద్వారా తెలుసుకొన్న అజిత్.. వెంటనే స్పందించారు. మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలను సిద్దం చేశారు. మాతోపాటు కమ్యూనిటీ సభ్యులందరికి ఆశ్రయం కల్పించారు. లవ్ యూ అజిత్ సార్ అంటూ విష్ణు విశాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

విష్ణు విశాల్ ట్వీట్ చూసిన వెంటనే తలా అజిత్ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. దటీజ్ తలా అంటూ.. మమ్మల్ని మరోసారి గర్వపడేలా చేశారు. ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడంలో అజిత్ తలా ఉంటారు. అజిత్ కుమార్ సార్ గ్రేట్ అంటూ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X