సూపర్ స్టార్ రజనీకాంత్ 67: ఎంత చెప్పినా తక్కువే!
Recommended Video

సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు 67వ వసంతంలోకి అడుగు పెట్టారు. రజనీకాంత్ అంటే తెలియని వారు ఆయన మంచితనం గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. రజినీకాంత్ గొప్ప సినిమా నటుడు. దేశంలో ప్రముఖ ప్రజాదరణ కలిగిన నటుడు. రజనీకాంత్ కంటే గొప్పగా నటించే వాళ్ళున్నా అంతమంది అభిమానులని సంపాదించింది ఆయన వ్యక్తిత్వం మంచితనమే. సినిమాల పరంగా కంటే ఒక మంచి మనిషి లాగానే ఆయనకు ఎక్కువమంది అభిమానులున్నారు. ఇటీవల తమిళనాడులో ఓఖి తుఫాను కారణంగా దాదాపు 500 మంది తమిళ జాలర్లు గల్లంతయ్యారు. 40 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇలాంటి తరుణంలో పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడానికి రజనీ ఇష్టపడటం లేదని, అందుకే రహస్య ప్రదేశంలోకి వెళ్లిపోయారని సన్నిహితులు అంటున్నారు. ఇప్పుడే కాదు పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులు చేసే హడావిడి నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఏడాది దూర ప్రాంతాలకు వెళ్లిపోయే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇలాంటి సంఘటనలు ఎన్నో ఆయన మంచితనాన్ని చూపించడానికి ఉన్నాయి. ఈ వయసులో కూడా అంతమంది అభిమానులున్నారంటే ఆయన క్రేజ్ ఏంటో తెలుస్తుంది. ఒక్క తమిళనాడులోనే కాదు దేశమంతటా ఆయన అభిమానులు ఉన్నారు. సాధారణ ప్రేక్షకుడి దగ్గర నుంచి బాలీవుడ్ హీరోల వరకూ అందరూ ఆయన అభిమానులే. ప్రస్తుతం దక్షిణాది నుంచి ఇంత ఇమేజ్ ఉన్న హీరో లేడంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు బాలీవుడ్ హీరోలు కూడా రజనీని ఏ రేంజ్ లో అభిమానిస్తారో అందరకి తెలిసిందే. షారూక్ ఖాన్ ఏకంగా తన సినిమాలో ఒక పాటతో ఆయనమీద అభిమానాన్ని చాటుకున్నాడు.
నా ప్రియమైన స్నేహితుడు అంటూ...రజనీకాంత్‌కు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ ఎంతో అనకువగల వ్యక్తి అని, చాలా మంచి హృదయం ఉన్న వ్యక్తి అని ఈ సందర్భంగా అమితాబ్ వ్యాఖ్యానించారు. 'రోబో' సినిమా విడుదలైన తరవాత చెన్నైలో అభిమానులంతా పండగ చేసుకుంటుంటే రజనీకాంత్ మాత్రం ఒంటరిగా బెంగళూరు వెళ్లారు. అక్కడ ఓ రిటైర్డ్ బస్ డ్రైవర్‌తో కలిసి ఆలయాలను సందర్శించడం మొదలుపెట్టారు. ఆ బస్ డ్రైవర్ ఎవరో కాదు. కండక్టర్ గా ఉన్న రజనీ లో మొదట హీరోని చూసింది ఆయనే. అందుకే ఇప్పటికీ స్నేహితుడి మాటకీ, జడ్జ్‌మెంట్‌కీ రజనీ గౌరవమిస్తారు. రజనీకాంత్ లో అందరకి నచ్చేది అయన స్టైల్ అయన నడిచినా స్టైల్, డైలాగ్ చెప్పినా స్టైల్, ఫైట్ చేసినా స్టైల్, కానీ అంత స్టైల్ గా ఉండే రజని చాలా మాములు జీవితం గడుపుతూ లుంగీ దరించి సాదారణ వ్యక్తి లా ఉండటం మమాత్రం చాలా గొప్ప విషయం.


Click it and Unblock the Notifications











