Ormax Survey: ప్రభాస్, షారుక్ టాప్ లేపిన విజయ్..నెంబర్ వన్‌గా దళపతి..రెబల్ స్టార్, బాద్షాకు ఎన్నో ర్యాంక్ అంటే
Ormax Survey: చిత్ర పరిశ్రమ రోజు రోజుకు మారుతోంది. సినీ ఇండస్ట్రీలో కొత్త కొత్త టెక్నాలజీ వస్తున్న కొద్దీ సినిమా స్వరూపం కూడా మారుతోంది. ఒకప్పుడు ఏదీ టాలీవుడ్ మూవీ, ఏదీ బాలీవుడ్ మూవీనో ఇట్టే చెప్పేవారు. కానీ, పరిస్థితులు మారాయి. నేటీ పరిస్థితుల్లో తెలుగు మూవీ కూడా హాలీవుడ్ మూవీలలో పోటీ పడే రేంజ్ వచ్చేసింది. ఈ క్రమంలో ప్రతిదీ పాన్ ఇండియా మూవీగానో.. వర్డల్ వైప్ మూవీగానో తీయాలని మూవీ మేకర్స్ కూడా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా పోయింది. ఏ మూవీ అయినా.. ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. దీంతో హీరోలు, హీరోయిన్ మధ్య పోటీ కూడా పాన్ ఇండియా లెవెల్ కు చేరింది.
ఇలా పాన్ ఇండియా వైప్ గా పోటీ పడుతున్న స్టార్ హీరో ఎవరు? హీరోయిస్ ఎవరనే విషయాలను తెలియజేస్తూ.. ప్రతి నెల ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ మీడియా ఓ సర్వే చేస్తుంది. ఈ సంస్థ దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్ పొజిషన్‌లో ఉన్న సెలబ్రిటీల లిస్ట్‌ను విడుదల చేస్తుంది. ఒకప్పుడు ఈ సర్వేలో సౌత్ హీరోస్, కానీ టాలీవుడ్ హీరోలు చాలా రేర్ గా కనిపించేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ హీరోలు తప్ప మిగతావారు చాలా రేర్ గా కనిపిస్తున్నారు. తాజా ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా'(Ormax Media) ఆగస్టు 2024 సర్వే రిపోర్టు వచ్చేసింది. మీరో కూడా ఓ లూక్కేయండి.

'ఓర్మాక్స్ మీడియా'(Ormax Media) ఆగస్టు 2024 సర్వే రిపోర్టులో ఎవరూ ఊహించని విధంగా మొదటి స్థానంలో కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నిలిచి అందర్నీ ఆశ్చర్యాన్ని గురి చేశారు. తన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి రికార్డు కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లాకొట్టిన తమిళ మూవీగా నిలిచింది. లాస్ట్ ఇయర్ విజయ్ నటించిన లియో మూవీ తో మొదటి సారి 200 కోట్ల మార్క్ ని అందుకుంది.
ఇక షారుక్ తర్వాత రెండో స్థానాన్ని ప్లాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దక్కించుకున్నారు. ఇక ప్రభాస్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుబలి సిరీస్ తరువాత ఆయన క్రేజ్ పూర్తి మారిపోయింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నుంచి ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాలే అనిచెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సలార్ , కల్కి మూవీ తన కెరీర్లో మైల్ స్టోన్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం రాజా సాబ్ మూవీ షూటింగ్లో ఉన్నా ప్రభాస్ తరువాత సలార్ 2, స్పిరిట్ మూవీ చేయనున్నారు.

ప్రభాస్ తర్వాత టాప్ 3 పొజిషన్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నిలిచారు. టాప్ 4 పొజిషన్ ను టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్నాడు. ఇక 5 వ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, 6 వ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 8 స్థానాన్ని అందుకున్నాడు. ఇక ఈసారి చివరి మూడు స్థానాల్లో అంటే.. 8 స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నిలువగా.. 9 వ స్థానంలో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, చివరగా పదో స్థానంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిలిచారు.

అయితే.. ఈసారి కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ ఫస్ట్ ప్లేస్ లో నిలబడడం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఎవరు ఊహించలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకొంతమంది అయితే అసలు ఈ సర్వేనే తప్పు అని కొట్టిపారేస్తున్నారు. వచ్చే నెలలో ఏ హీరో టాప్ లో నిలుస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











