విజయ్ ఇంటిని పేల్చివేస్తాం.. కంట్రోల్ రూమ్‌కు ఫోన్.. పోలీసుల్లో టెన్షన్

తమిళ సూపర్‌స్టార్ విజయ్ తన తాజా చిత్రం బిగిల్ విజయోత్సవంలో మునిగి తేలుతుంటే.. మరో పక్క అగంతకులు తన ఇంటిని బాంబుతో పేల్చివేస్తామని బెదిరింపులు రావడం తమిళ సినిమా పరిశ్రమలో సంచలనం రేపింది. విజయ్ మూవీ విడుదలైన ప్రతీసారి ఏదో రకంగా వివాదం చెలరేగడం తెలిసిందే. బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసుల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఫోన్ కాల్‌కు కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

 విజయ్ నివాసంలో బాంబు పెట్టాం

విజయ్ నివాసంలో బాంబు పెట్టాం

మీడియా కథనాల ప్రకారం.. సాలిగ్రామ్‌లోని విజయ్ నివాసంలో బాంబు పెట్టాం. అది ఏ క్షణమైనా పేలవచ్చని అగంతకులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు విజయ్ ఇంటికి పరుగులు పెట్టారు. సాలిగ్రామ్‌లోని ఉంటున్న తల్లిదండ్రులు (నిర్మాత ఎస్ఏ చంద్రశేఖర్, శోభ) సురక్షిత ప్రాంతానికి తరలించారు అని వెల్లడించాయి.

బెదిరింపు కాల్ ఎవరు చేశారని

బెదిరింపు కాల్ ఎవరు చేశారని

అనంతరం విజయ్ తండ్రి చంద్రశేఖర్‌ను అలాంటి కాల్ ఏమైనా వచ్చిందా అని తెలుసుకొన్నారు. ఆ తర్వాత వారికి తగిన సెక్యూరిటి సిబ్బందిని ఏర్పాటు చేశారు. భార్య సంగీతతో విజయ్ ఉంటున్న ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో పనైయూర్‌లోని విలాసవంతమైన బంగ్లాకు వారిని తరలించారు. ఈ బెదిరింపు కాల్ ఎవరు చేశారు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారని మీడియా కథనాల్లో పేర్కొన్నారు.

 సైబర్ ఎటాక్ చట్టం కింద కేసు

సైబర్ ఎటాక్ చట్టం కింద కేసు

విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ అంశంపై సైబర్ ఎటాక్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చిందనే విషయంపై దర్యాప్తును ముమ్మరం చేశారు. అనంతరం పోరురులోన అలపక్కమం నుంచి ఓ యువకుడు ఫోన్ చేసినట్టు తేల్చారు. ప్రస్తుతం ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద బిగిల్ జోరు

బాక్సాఫీస్ వద్ద బిగిల్ జోరు

కాగా విజయ్ నటించిన తాజా చిత్రం బిగిల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం రూ.150 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి భారీ ప్రేక్షకాదరణ లభిస్తున్నది. కాగా, దళపతి విజయ్ తన 64వ సినిమాను వెంటనే ప్రారంభించాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం విజయ్ షూటింగ్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, మాలవిక మోహనన్, ఆంథోని వర్గీస్, శంతను భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X