యువ టెలివిజన్ నటుడు ఆత్మహత్య.. స్నేహితుడి ఇంటిలోనే దారుణం!
పాండియన్ స్టోర్స్ ఫేమ్, వీజే చిత్ర ఆత్మహత్య ఉదంతంతో తేరుకోక ముందే మరో టెలివిజన్ నటుడు సూసైడ్ చేసుకోవడం కోలీవుడ్ ప్రముఖులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. బుల్లితెరపై ఆకట్టుకొంటున్న ఇందిరా కుమార్ ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. ఇందిరా కుమార్ సూసైడ్ వెనుక కారణాలు ఏమిటంటే...

ఇందిరా కుమార్ ఆత్మహత్యతో
నటుడు ఇందిరా కుమార్ శ్రీలంకకు చెందిన శరణార్థి. గత కొద్దికాలంగా తమిళ టెలివిజన్ రంగంలో నటుడిగా రాణిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఇనై నొక్కి పాయుమ్ థోటా సీరియల్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఇప్పడిప్పుడే ప్రేక్షక ఆదరణ పొందుతున్న ఇందిరా కుమార్ ఆత్మహత్య చేసుకొన్నారనే వార్త సన్నిహితులు, కుటుంబ సభ్యుల తీవ్ర విషాదంలోకి నెట్టింది.

స్నేహితుడి ఇంటిలో సూసైడ్
ఇందిరా కుమార్ పెరంబలూర్‌లోని స్నేహితుడి ఇంటిలో ఉంటున్నారు. ఫిబ్రవరి 19వ తేదీన ఆయన తన ఫ్రెండ్ నివాసంలో ఉరి వేసుకొన్నారు. బుధవారం సినిమా చూసేందుకు తన స్నేహితులతో కలిసి పెరంబలూర్‌కు వెళ్లారు. ఆ తర్వాత స్నేహితుడి ఇంటిలోనే ఉండిపోయారు. అయితే ఊహించని విధంగా స్నేహితుడి ఇంటిలో మరణించడం అందర్నీ షాక్ గురి చేసింది.

సూసైడ్ వెనుక అసలు కారణం
మీడియా రిపోర్టుల ప్రకారం.. ఇందిరా కుమార్ మరణ వార్తను స్నేహితుడు పోలీసులకు చేరవేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇందిరా కుమార్ పార్ధీవ దేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించారు. ఇందిరా కుమార్ సూసైడ్ కారణాలను ఆరా తీస్తున్నారు. సూసైడ్ నోట్ కూడా లభించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆఫర్లు లేకపోవడంతో మానసికంగా
తాజా మీడియా సమాచారం ప్రకారం.. ఇందిరా కుమార్ టెలివిజన్ ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో మానసికంగా కుంగిపోయారు. ఆఫర్లు లేకపోవడంతో మనస్తాపం చెందారు. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకొంటారని ఊహించలేదు అని సన్నిహితులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











