తమిళ టీవీ నటి నీలానీ ఆత్మహత్యాయత్నం!
ప్రముఖ తమిళ టీవీ నటి నీలానీ ఆత్మహత్యయత్నం చేశారు. విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ప్రాణానికి ఎలాంటి హాని లేదని వైద్యులు తెలిపినట్లు సమాచారం. నీలాని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలే అని తెలుస్తోంది.
లలిత్ కుమార్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కొన్ని రోజులుగా తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని నీలాని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం లలిత్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడటంతో... అతడి చావుకు కారణం నీలానీ అంటూ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఆమె మనస్థాపానికి గురైనట్లు సమాచారం.

లలిత్ కుమార్ మరణం తర్వాత చుట్టు పక్కలవారు అనే మాటలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగుతో పాటు లలిత్ కుమార్ మరణానికి కారణం నేను అంటూ కేసు కూడా నమోదు కావడంతో తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి ఇలా చేసినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ప్రస్తుతం నీలానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కోలుకున్న తర్వాత ఈ కేసును విచారిస్తామని చెన్నై మైలాపూర్ పోలీసులు వెల్లడించారు. లిలిత్ కుమార్ మరణం.... నీలానీ ఆత్మహత్యాయత్నం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











