Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
విషాదం.. ఆత్మహత్య చేసుకున్న తమిళ నటి, పెళ్ళై మూడేళ్లయినా.. రమ్యకృష్ణతో కలసి!
Recommended Video
సినిమా లోకం అనేది రంగుల ప్రపంచం. నిజజీవితానికి భిన్నంగా ఉన్నట్లు సినిమా ప్రపంచం అనిపిస్తుంది. కానీ సినిమా నటులు కూడా మనుషులే. సాధారణ కుటుంబ కష్టాలు వీరికి కూడా ఉంటాయి. తాజగా చైన్నైలో విషాదం చోటు చేసుకుంది. తమిళ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. బుల్లితెర నటి ప్రియాంక పలు టివి సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయింది. కొన్ని చిత్రాలలో కూడా నటించింది. ఆమె ఊహించనివిధంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
ఉరేసుకుని
నటి ప్రియాంక చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటోంది. నేటి ఉదయం ఆమె తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంక ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారా లేరా అనే విషయాలని పోలీసులు దర్యాప్ట్ చేస్తున్నారు.
కుటుంబ సమస్యలు
ప్రియాంక ఆత్మహత్యకు సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనం ప్రకారం కుటుంబ సమస్యలే ఆమె ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. వివాహం అనంతరం కూడా ప్రియాంక టివి సీరియల్స్ లో నటిస్తోంది.
పెళ్ళై మూడేళ్లయినా
ప్రియాంకకు మూడేళ్ళ క్రితమే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఇంతవరకు సంతానం కలకగా పోవడంతో ఆమె మనో వేదనకు గురైందని, ఆ పరిస్థితే ఆత్మహత్యకు దారి తీసిందని ప్రాధమికంగా తెలుస్తోంది.
రమ్యకృష్ణతో కలసి
వంశం అనే టివి సీరియల్ ప్రియాంకకు మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. ఈ సీరియల్ లో ప్రముఖ నటి రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటించింది. ప్రియాంక మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు.