twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ షాక్.. షూటింగ్స్ బంద్.. వారం తిరక్కుండానే ఆశలు గల్లంతు.. మళ్లీ మోక్షమెప్పుడో!

    |

    కరోనా వైరస్ రోజురోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడులో అయితే కరోనా ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశం మొత్తం మీద ఉన్న కేసుల్లో ఈ రెండు రాష్ట్రాల నుంచే ఎక్కువగా ఉన్నాయి. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ ఏవిధంగానూ ఉపయోగపడలేదు. మెల్లి మెల్లిగా సడలింపులు రావడంతో.. కరోనా కూడా కొద్దికొద్దిగా తన ప్రభావాన్ని చూపెడుతూ వచ్చింది.

    అన్నీ బంద్..

    అన్నీ బంద్..

    కరోనాను కట్టడి చేసేందుకు గత మూడు నెలలుగా లాక్ డౌన్ పాటిస్తూ వస్తున్నాం. అయితే కరోనా ఎంతమాత్రం తగ్గలేదు. కానీ లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అన్ని పరిశ్రమలు మూతపడటంతో ఎంతో మంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

    షూటింగ్స్ లేక విలవిల..

    షూటింగ్స్ లేక విలవిల..

    సినీ పరిశ్రమపై కరోనా పెద్ద దెబ్బే కొట్టింది. ఎన్నో వేల మంది కార్మికులను కూడు లేకుండా చేసింది. సినిమా పరిశ్రమ, టీవీ రంగం పూర్తిగా స్థంభించిపోయింది. దినసరి కూలీలు, రోజూ వారి శ్రామికులను ఆదుకునేందుకు పెద్ద హీరోలంతా ముందుకు వచ్చారు. వీరి కోసం ఫెఫ్సీ అన్ని రకాల సాయాన్ని చేసింది.

    అనుమతి లభించింది..

    అనుమతి లభించింది..

    అయితే కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా తమిళనాడులోనూ టీవీ సీరియల్స్ షూటింగులకు ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి బుల్లితెర కళాకారుల సంఘం నిర్వాహకురాలు ఖుష్బూ తదితరులు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి షూటింగులకు అనుమతిని సాధించారు.

    Recommended Video

    Senior Hero Challenges MLA Roja Husband || Filmibeat Telugu
    ఆశలు గల్లంతు..

    ఆశలు గల్లంతు..


    ప్రభుత్వ అనుమతితో వారం రోజుల పాటు షూటింగులు జోరుగా సాగాయి. అయితే, కరోనా ఒక్కసారిగా విజృంభించడంతో మళ్లీ మొదటికి వచ్చింది. కరోనా ధాటిని తట్టుకోలేక చెన్నై సహా కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో ఈనెల 19 నుంచి మరోసారి సంపూర్ణ లాక్ డౌన్‌ను విధించారు. ఈ నెలాఖరు వరకు ఈ జిల్లాల్లో పూర్తి లాక్ డౌన్ ను ప్రకటించడంతో టీవీ సీరియల్స్ షూటింగులు నిలిచిపోయాయి. ఇక ఉపాధి దొరికిందని ఆశపడ్డ కార్మికుల ఆశలు గల్లంతయ్యాయి.

    English summary
    Tamil tv serial shooting cancelled due To Lockdown. Recently Corona cases Are increased In Chennai so that Shooting Permission Cancelled.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X