అక్కడ పవన్-మహేష్ లతో బిజినెస్ పెంచుకోవాలి చూస్తున్నారు...!?
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇంతకాలం సొంత గ్రౌండ్ లో తలపడ్డారు. కానీ త్వరలో వాళ్లిద్దరూ తటస్థ వేదికలో అమీ తుమీ తేల్చుకోబోతున్నారు. మహేస్ బాబు సినిమా బిజినెస్ మ్యాన్ తో పాటు, పవన్ కళ్యాణ్ నటించిన పంజా తమిళంలోకి అనువాదమవుతున్నాయి. ఈ రెండు చిత్రాల తమిళ వెర్షన్స్ సంక్రాంతికి తమిళనాట రిలీజ్ కానున్నాయి.
పవన్ కళ్యాణ్-విష్ణువర్థన్ కాంబినేషన్ లో వస్తున్న 'పంజా" తమిళ వెర్షన్ కి 'కురి" అనే పేరు ఖరారు చేశారు. త్వరలోనే ఆడియోని తమిళంలో విడుదల చేయనున్నారు. అలాగే బిజినెస్ మ్యాన్ ఆడియోతో పాటు సినిమాని కూడా తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల చేయాలని తలపెట్టారు.
తెలుగు చిత్రాలకి తమిళనాట మార్కెట్ పెరిగితే బాగుండని కొద్ది కాలంగా అంతా భావిస్తున్నప్పటికీ ఇంకా అక్కడ మన డబ్బింగ్ చిత్రాలికి అంతగా డిమాండ్ ఏర్పడలేదు. పవన్, మహేష్ ఇద్దరూ అక్కడి వారికి కూడా బాగా తెలిసిన హీరోలు కనుక వీరి సినిమాల్తో అది సాధ్యపడుతుందనే అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











