బాషా, నాయగన్, గుణ సినిమాల రచయిత బాలకుమారన్ ఇక లేరు

By Bojja Kumar

ప్రముఖ నవలా రచయిత, తమిళ సినిమా రైటర్ బాలకుమార్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం మృతి చెందారు. తమిళంలో ఎన్నో విజయవంతమైన సినిమాలకు బాలకుమారన్ స్క్రిప్టు రైటర్‌గా పని చేశారు. కమల్ హాసన్ నటించిన 'గుణ', రజనీకాంత్ మూవీ 'బాషా' చిత్రాలతో ఆయన తమిళంలో టాప్ రైటర్‌గా ఎదిగారు.

బాషా మూవీలో రజనీకాంత్ ఫేమస్ డైలాగ్ 'బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే' రాసింది ఈ రచయితే. సినిమా వచ్చి ఇన్నేళ్లయినా... ఇందులోని ఈ డైలాగ్ ఇప్పటికీ అలా నిలిచిపోయింది. ఇలాంటి ఎన్నో సెన్సేషనల్ డైలాగులు బాలకుమారన్ రాశారు.

Tamil writer Balakumaran passed away

తమిళ చిత్రం 'కాదలన్'(ప్రేమికుడు) చిత్రానికి‌గాను బాలకుమారన్ తమిళనాడు ప్రభుత్వంతో ఉత్తమ రచయిత అవార్డు అందుకున్నారు. 1988లో వచ్చిన 'ఐదు నంబ ఆలు' చిత్రానికి దర్శకుడిగా కూడా బాలకుమారన్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

బాలకుమార్ చివరగా ధనుష్ హీరోగా వచ్చిన 'పదు‌పెట్టై', శిబు హీరోగా వచ్చిన 'మన్మధన్', 'వల్లభన్' చిత్రాలకు పని చేశారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 150 పుస్తకాలు, వివిధ మేగజైన్లలో 100కుపైగా కథలు రాశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X