సినీ రచయితపై సైబర్ సెక్స్ కంప్లైంట్

By Srikanya

ఆన్ లైన్ చాటింగ్ లో తనను ఒక సినీ రచయిత లైంగికంగా వేధించారని ఒక మహిళ ఆరోపిస్తూ కంప్లైంట్ చేయటం పరిశ్రమ వర్గీయులను ఆలోచనలో పడేసింది. చెన్నైలో ఉండే ప్రముఖ తమిళ సినీ రచయిత చారు నివేదిత అనే ఆయనపై ఈ ఆరోపణ వచ్చింది. ఆయన ఫాన్ క్లబ్ లో ఇటీవలే ఒక మహిళ చేరింది. ఆయనతో ఆన్ లైన్ చాటింగ్ లో కొంతకాలం మర్యాదగాసాగిన చాటింగ్ మెల్లగా అసభ్యకర భాషలోకి మారటంతో ఈ వివాదం మొదలైంది. దాంతో అలాంటివి వాడవద్దని ఆ మహిళ కోరింది. కాని ఆయన వినకుండా అసభ్యంగా పదజాలం వాడడం, తనను ప్రేమించమని వెంటాడడంతో తాను ఫాన్ క్లబ్ అక్కౌంట్ నుంచి తప్పుకున్నానని, ఆ తర్వాత అతని మనుషులు కొందరు వేదించారని ఆమె ఆరోపించారు.

ఈ విషయాన్ని ఆమె తరపున పోరాడుతున్న తమిళచ్చి అనే ఆమె బాదితురాలిని రచయిత వేధించరనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఫ్రాన్స్ లో ఉండే తమిళచ్చి బాధితురాలు తరపున వాదిస్తున్నారు. తనవద్ద చారు నివేదిత అసభ్యంగా మాట్లాడిన సంభాషణల డిజిటల్ ఆధారాలు ఉన్నాయని చెప్పారు.ఆన్ లైన్ లోకూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె విచారం వ్యక్తం చేశారు. అయితే రచయిత చారు నివేదిత ఈ విషయాలను ఖండిస్తున్నారు.తన పాస్ వర్డ్ ను ఎవరో హ్యాక్ చేశారని, ఇలాంటిది రెండో ఫిర్యాదు అని ఆయన తన భార్య, దేవుడు మీద ఒట్టేసి చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం డిజిటల్ ఆదారాలతో కేసు వస్తే సైబర్ సెక్స్ క్రైమ్ కింద కేసు రిజిస్టర్ చేస్తామని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X