twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశాల్ అభ్యర్థన తోసిపుచ్చిన కోర్టు, ఏం జరుగబోతోందో?

    |

    తమిళనాట నడిగర్ సంఘం ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. జూన్ 23న ఎన్నికలు జరిగిన తర్వాత పలు అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలపై స్టే ఆర్డర్, తర్వాత స్టే రిమూవల్ ఇలా హై డ్రామా చోటు చేసుకుంది. రెండు వర్గాలు ఈ సారి పోటాపోటీగా తలపడ్డాయి.

    గత ఎన్నికల్లో నాజర్, విశాల్, కార్తి నేతృత్వంలోని ప్యానల్ గెలుపొందిన సంగతి తెలిసిందే. మరోసారి విజయం దక్కించుకునేందుకు ఈ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే కె భాగ్యరాజా నేతృత్వంలోని మరో వర్గం ఈ సారి ఎలాగైనా వారిని పదవి నుంచి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

    ఎన్నికలు సక్రమంగా జరిగినప్పటికీ... తర్వాత ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. నటుడు మోహన్ ఓటు ఇంకెవరో వేయడంతో వివాదం మరింత పెద్దగా మారింది. ఈ నెలలో రిజల్ట్ విడుదలవ్వాల్సి ఉండగా... ఓట్లను మళ్లీ కౌంట్ చేయాలని విశాల్ కోర్టును ఆశ్రయించారు.

    Tamilnadu court has rejected Vishals demand

    అయితే విశాల్ డిమాండును కోర్టు తిరస్కరించింది. పోస్టల్ ఓట్లకు సంబంధించిన అంశంపై నివేదికను సమర్పించాలని జడ్జి ఆదికేశవులు విశాల్ అండ్ టీంకు సూచించారు. తదుపరి విచరాణ శుక్రవారం(జులై 12)కు వాయిదా వేశారు.

    కాగా.. ఈసారి నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ జరుగడానికి ముందు ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు సైతం చేసుకున్నారు. తన తండ్రి పేరును ఈ ఎన్నికల గొడవలోకి లాగడంపై నటి వరలక్ష్మి శరత్ కుమార్... విశాల్ మీద ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

    English summary
    Tamilnadu court has rejected Vishal's demand about The Nadigar Sangam elections count votes, and judge Aadhikesavalu has instructed Vishal and team to submit the report in response to the question on postal votes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X