twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమాని ఫోన్ లాక్కొని జేబులో పెట్టుకున్న హీరో అజిత్.. ఇవ్వను వెళ్లిపో అంటూ వార్నింగ్

    |

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉదయాన్నే ప్రశాంతంగా మొదలైంది. ఇక ఓటర్లు తెల్లవారుజామున పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ స్థాయిలో దర్శనమిచ్చారు. గ్రామాల్లో కూడా పోలింగ్ హడావుడి గట్టిగానే కనిపిస్తోంది. ఇక స్టార్ హీరోలు నటీనటులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే వారిని చూసి అభిమానులు ఎగబడటం ఇబ్బందిగా అనిపించింది. ఇక హీరో అజిత్ భార్యతో కలిసి రాగా కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరకు ఆయన సహనం కోల్పోయారు.

    పోలింగ్ కూడా అదే రేంజ్ లో

    పోలింగ్ కూడా అదే రేంజ్ లో

    తమిళనాడులో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికల ప్రచారాలు ఒక రేంజ్ లో జరిగాయి. కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు భారీ స్థాయిలో ప్రచారాలు నిర్వహించారు. ఇక పోలింగ్ కూడా అదే రేంజ్ లో కొనసాగుతోంది. అయితే కోవిడ్ ప్రభావం వలన ఓటింగ్ శాతంపై ప్రభావం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

    ఓటు వేయాలని చెప్పిన సినీ తారలు

    ఓటు వేయాలని చెప్పిన సినీ తారలు

    ఇక ఓటు హక్కును వినియోగించుకోవాలని గత కొన్ని రోజులుగా సినీ తారలు భారీ స్థాయిలో ప్రచారాలు కూడా చేశారు. సోషల్ మీడియాలో కూడా అభిమానులకు పిలుపునిచ్చారు. ఉదయాన్నే అందరూ ఓటు వేయాలని ఇది మన అందరి బాధ్యత అంటూ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్లు వివరణ ఇచ్చారు.

    ఇబ్బంది పడిన సినీ తారలు

    ఇబ్బంది పడిన సినీ తారలు

    ఉదయమే రజనీకాంత్, కమల్ హాసన్ , సూర్య వంటి అగ్ర తారలు వారి సమీప పోలింగ్ బూతులో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అభిమానుల వలన కొంతమంది సెలబ్రెటీలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. పెద్దగా సెక్యూరిటీ లేకపోవడంతో కొంతమంది స్టార్స్ పోలింగ్ బూతు నుంచి బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు.

    అజిత్ ఆగ్రహం

    ఇక అభిమానుల తాకిడికి హీరో అయితే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్య షాలినీతో కలిసి అజిత్ తిరువాన్మయూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాదారణ వ్యక్తిలా క్యూలో నిలబడి ఓటు వేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ఫోన్ లాక్కొని..వార్నింగ్

    ఫోన్ లాక్కొని..వార్నింగ్

    అయితే ఒక అభిమాని అత్యుత్సాహంతో అజిత్ సహనం కోల్పోవాల్సి వచ్చింది. సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అభిమాని సెల్ఫీ తీసుకుంటూ ఉండడంతో అజిత్ ఫోన్ లాక్కొని జేబులో పెట్టేసుకున్నాడు. అతను ఫోన్ అడిగినా కూడా ఇవ్వలేదు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపో అంటూ వార్నింగ్ ఇచ్చారు.మళ్ళీ కొంత సేపటి తరువాతఅజిత్ వెళ్లిపోయేటప్పుడు తిరిగి అతని ఫోన్ అతనికి ఇచ్చేశాడు.

    English summary
    The ongoing Assembly elections in Tamil Nadu have also become a hot topic. And everyone is exercising their right to vote. Kollywood stars are also exercising their voting right one by one..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X