TN elections: ఓటు వేసిన స్టార్ హీరోలు.. సైకిల్‌పై వచ్చిన విజయ్.. రజనీకాంత్, సూర్య, అజిత్ ఇలా..
తమిళనాడు అనగానే అందరికి గుర్తొచ్చేది అక్కడి రాజకీయాలు. సినిమాల హడావుడి ఎంత ఎంత ఉన్నా కూడా రాజకీయ. గొడవలు మొదలైతే దేశమంతా తమిళనాడు వైపే చూస్తుంటుంది. ఇక ఎలక్షన్స్ వస్తే ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు మారిపోతాయి. ఇక ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఇక ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్స్ కూడా ఒక్కొక్కరిగా వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

రజనీకాంత్.. అందరికంటే ముందే
తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా
కొనసాగుతోంది. ఈ ఎలక్షన్ పైనే దేశమంతా ఫోకస్ పెట్టింది.
ఇక ఈ రోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్ లకు చేరుకొని వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక స్టార్ సెలబ్రెటీలు కూడా ఒక్కొక్కరిగా తరలి వస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అందరికంటే ముందే ఉదయాన్నే వచ్చి తన ఓటు వేశారు.

సూర్య బ్రదర్స్
హీరో సూర్యతో పాటు అతని తమ్ముడు కార్తీ కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. జనాలు ఎక్కువగా మోహరించకముందే ఓటు హక్కును వినియోగించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అజిత్ ఆగ్రహం..
ఇక సినీ తారలు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారని అభిమానులు భారీ సంఖ్యలో రావడం వలన కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. హీరో అజిత్ తన సతీమణి షాలినితో కలిసి తిరువాన్మయూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే అభిమానులు సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అభిమాని సెల్ఫీ తీసుకుంటూ ఉండడంతో అజిత్ ఫోన్ లాక్కొని జేబులో పెట్టేసుకున్నాడు.

సైకిల్ పై వచ్చిన విజయ్
ఇక మరొక స్టార్ హీరో విజయ్ నెవర్ బిఫోర్ అనేలా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏకంగా సైకిల్ మీద రావడం హాట్ టాపిక్ గా మారింది. ఒక సాధారణ వ్యక్తిలా తన ఇంటి నుంచి నీలాంగిరి పోలీంగ్ బూత్ వరకు సైకిల్ పై వచ్చిన విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.


Click it and Unblock the Notifications











