Leo విజయ్ లియో మూవీకి షాకిచ్చిన ప్రభుత్వం.. స్పెషల్ షోలపై జీవో జారీ.. టెన్షన్‌లో ఫ్యాన్స్!
తమిళ సూపర్ స్టార్ విజయ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్, సౌత్ ఇండియన్ స్టార్స్ అర్జున్ సర్జా, త్రిషా కృష్ణన్ నటించిన లియో చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు సిద్దమైంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో, కాల్ ఫ్లిక్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
విజయ్ నటించిన లియో సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో స్పెషల్ షోలు ప్రదర్శించుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నిర్మాతలు ధరఖాస్తు చేసుకొన్నారు. అక్టోబర్ 19వ తేదీన ఉదయం 4 గంటలకు, అలాగే 9 గంటలకు స్పెషల్ షోలు ప్రదర్శించుకొంటాం. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉదయం 7 గంటల షోను ప్రదర్శించుకొంటాం. కాబట్టి స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వమని లేఖలో పేర్కొన్నారు.

అయితే నిర్మాతల అనుమతి లేఖ అందుకొన్న తర్వాత చెన్నైలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు స్పెషల్ షోలను ప్రదర్శించుకొనేందుకు అనుమతి ఇవ్వాలా? వద్దా అనే విషయాన్ని నిర్ఱారించమని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులు తమ పరిధిలో ఎంక్వైరీ చేసి.. ప్రత్యేక షోలకు సెక్యూరిటీ, ఇతర సదుపాయలు, వసతులు కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

రెవెన్యూ అధికారుల రిపోర్టు తర్వాత.. ప్రభుత్వం జీవోను జారీ చేసింది. లియో సినిమాను ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. అక్టోబర్ 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ జీవో ద్వారా అనుమతి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం.. 14 ఏ కింద ఈ అనుమతి ఇవ్వడం జరిగింది అని జీవోలో పేర్కొన్నారు.

అయితే ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని లియో నిర్మాతలు చెప్పారు. కానీ నిర్మాతలు కోరినట్టు 4 గంటల షో ప్రదర్శించుకోవడానికి అనుమతి ఉందా? లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దాంతో స్పెషల్ షో 4 గంటలకు వేస్తారా? లేదా 7 గంటలకు ప్రదర్శిస్తారా? అనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











