twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో విశాల్‌కు తమిళ సర్కార్ షాక్.. ఇకపై ఈ స్టార్ అక్కడ డమ్మీ?

    |

    Recommended Video

    Government Appoints Special To Manage TFPC,As Vishal Accused Of Fund Misuse || Filmibeat Telugu

    తమిళ సినీ నిర్మాతల మండలిలో చాలా కాలంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. నిర్మాతల మండలికి విశాల్ ప్రెసిడెంటుగా ఎన్నికైనప్పటి నుంచే కొందరు ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు. తరచూ విశాల్ మీద ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. విశాల్ అండ్ టీమ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాటు ఆయన వ్యవహార శైలి వల్ల చిన్న నిర్మాతలు నష్టపోతున్నారనే వాదన తరచూ వినిపిస్తూనే ఉంది.

    విశాల్ మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగింది. తమిళ నిర్మాతల మండలి వ్యవహారాలు సంవత్సరం పాటు పర్యవేక్షించేలా ఎన్ శేఖర్ అనే అధికారిని నియమించింది. వచ్చే ఏడాది నిర్మాతల మండలి ఎన్నికలు జరిగి కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు ఎన్ శేఖర్ పర్యవేక్షణ ఉంటుందట. ఈ చర్యతో ప్రభుత్వం విశాల్ డమ్మీ ప్రెసిడెంటును చేసిందని చర్చించుకుంటున్నారు.

    విశాల్ మీద ఆరోపణలు

    విశాల్ మీద ఆరోపణలు

    ఇక నుంచి ప్రెసిడెంట్ విశాల్ అండ్ టీమ్ నిర్మాతల మండలికి సంబంధించిన ఏ పని చేసినా, డబ్బు ఖర్చు పెట్టాలన్నా ఎన్.శేఖర్ అనుమతితోనే చేయాల్సి ఉంటుందట. విశాల్ నేతృత్వంలోని టీమ్ మీద ప్రధానంగా 3 ఆరోపణలు ఉండటం, అవి రుజుకు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    అలా చేయడం నిబంధనలకు విరుద్ధం

    అలా చేయడం నిబంధనలకు విరుద్ధం

    నిర్మాతల మండలి సభ్యులకు పెన్షన్, బహుమతులు ఇస్తోంది. తమిళనాడు సొసైటీస్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలకు ఇది విరుద్ధం. విశాల్ జనరల్ బాడీ మీటింగ్స్ నిర్వహించడం లేదు. అంతే కాదు జనరల్ బాడీ మీటింగ్ జరుగకుండానే, వారి అనుమతి లేకుండానే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారట. వాటికి సరైన లెక్కలు కూడా చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

    విశాల్ టీంకు ఊహించని షాక్

    విశాల్ టీంకు ఊహించని షాక్

    నిర్మాతల మండలి వ్యవహారాలు చూసుకునేందుకు ఎన్ శేఖర్‌ను నియమించడం ద్వారా విశాల్ అంట్ టీంకు ప్రభుత్వం షాకిచ్చిందని చర్చించుకుంటున్నారు. అంతే కాదు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా విశాల్ కొనసాగుతున్నారు. అక్కడ కూడా విశాల్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి.

    ఎలా రియాక్ట్ కాబోతున్నాడు?

    ఎలా రియాక్ట్ కాబోతున్నాడు?

    కొన్ని రోజుల క్రితం తమిళ నిర్మాతల మండలి వద్ద పెద్దగొడవ జరిగింది. ఓ వర్గం కార్యలయానికి తాళం వేయగా... విశాల్ దాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు విశాల్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన సినిమా షూటింగులో బిజీగా ఉన్న విశాల్... తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించాల్సి ఉంది.

    English summary
    The government of Tamil Nadu has appointed a special officer named N Sekar to manage Tamil Nadu Film Producers Council for a year. An election will be conducted again within next year and Sekar will handover things to the elected president.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X