రజనీ, కమల్ లకి స్టేట్ అవార్డు
2007-2008 సంవత్పరానికిగాను జాతీ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న వారి జాబితాను రీసెంట్ గా సెక్రటరియేట్ కన్ ఫామ్ చేసింది. చెన్నైలో నిర్వహించనున్న తమిళ సినిమా అవార్డు ఉత్సవంలో తమిళనాడు ముఖ్యమంత్రి యం కరుణానిధి ముఖ్య అథిదిగా పాల్గొని టాప్ యాక్టర్స్ కు అవార్డులను బహుకరించబోతున్నారు. ఈ క్రమంలో ప్రథమ స్థానంలో రజనీకాంత్, కమల్ హాసన్ ఉండటం విశేషం. సూపర్ స్టార్ రజనీకాంత్, డైనమిక్ హీరో కమల్ హాసన్ ను జంటగా అప్పుడప్పుడు అక్కడక్కడా చూస్తూంటాము. మరి ఈ జంట పక్షులకి తమిళనాడు స్టెట్ గౌర్నమెంట్ అవార్డును ప్రకటించింది. 2007 సంవత్సరానికి గాను 'శివాజి" సినిమాలో తన నటనకు ఉత్తమనటుడుగా 'రజనీకాంత్" గారికి లభించింది. అలాగే 2008 సంవత్సారానికి 'దశావతారం" సినిమా ద్వారా 'కమల్ హాసన్" గారికి కూడా ఉత్తమనటుడు అవార్డుకు ఎంపికవ్వడం విశేషం. ఈ అవార్డుల ఉత్సవాలలో ఈ స్టార్ హీరోలతో పాటు మరికొందరు ప్రముఖులు దర్శనమీయ్యబోతున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ తమిళ సినిమాలలో చూపిన పెర్ఫామెన్స్ కి గాను 2005 లో 'చంద్రముఖి" రజినికి, 2006 లో 'వెతయాడు విలయాడు" సినిమాకు కూడా వచ్చే అవకాశం వుందని అంటున్నారు.
ఈ శుభసంధర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన 60 వ పుట్టినరోజును త్వరలో జరుపుకోబోతున్నారు. సో దట్స్ తెలుగు తరుపున రజనీకి అడ్వాన్స్ బెస్ట్ విషెస్.


Click it and Unblock the Notifications











