అక్షర హాసన్ హాసన్‌తో డేటింగ్ చేసింది నిజమే.. కానీ ఆ ఫోటోలు!

అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోలు లీక్ అయిన ఘటన కలకలం రేపుతోంది. అక్షర హాసన్ లోదుస్తులు, బికినీ ధరించి తన గదిలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో అక్షర హాసన్ ముంబై పోలీసులని కలసి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసు విచారణ లో భాగంగా సీనియర్ హీరోయిన్ రతి అగ్నిహోత్రి తనయుడు తనూజ్ విర్వాణి పేరు తెరపైకి వచ్చింది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. తనూజ్ కు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ కేసు వ్యవహారంలో తనూజ్ ఎట్టకేలకు స్పందించాడు.

Recommended Video

Akshara Haasan’s private pics Issue : Rati Agnihotri’s son Tanuj Virwani Had Share in this issue
నేను అలాంటి వ్యక్తిని కాదు

నేను అలాంటి వ్యక్తిని కాదు

తాను, అక్షర హాసన్ గతంలో రిలేషన్ లో ఉన్న సంగతి వాస్తవమే అని తనూజ్ తెలిపాడు. కానీ ఇలా అర్థనగ్న ఫోటోల గురించి ఆమెని తానెప్పుడూ అడగలేదని తనూజ్ అంటున్నాడు. నేను అలంటి వ్యక్తిని కాదు. మేమిద్దరం రిలేషన్ లో ఉన్నప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నాం. ఇంతకు మంచి మా రిలేషన్ కు సంబంధించిన వివరాలు నేను మాట్లాడలేను.

నేనే ఆమెకు రక్షణ కల్పించా

నేనే ఆమెకు రక్షణ కల్పించా

ఏ మహిళకు అయినా, అమ్మాయికి అయినా ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు. ఆమె ఫోన్ ని ఉపయోగించేది తానేనని, కాబట్టి ఆ ఫోటోలు తానే లీక్ చేసి ఉంటానని నిందలు వేస్తుంటే భాదగా ఉంది. తామిద్దరం స్నేహితులుగా ఉన్నా సమయంలో అక్షరకు చాలా సందర్భాల్లో రక్షణగా ఉన్నా. విడిపోయాక కూడా ఒక స్నేహితుడిగా పలు విషయాల్లో ఆమెకు రక్షణ కల్పిస్తున్నా అని తనూజ్ అభిప్రాయపడ్డాడు.

ఆమె ఫోటోలు ఉండేవి

ఆమె ఫోటోలు ఉండేవి

మేమిద్దరం రిలేషన్ లో చాలా కాలం ఉన్నాం. కాబట్టి ఒకరికి సంబందించిన సన్నిహిత సమాచారం మరొకరివద్ద ఉంటుంది. నిజమే.. అక్షర హాసన్ ఫోటోలు లాంటి సన్నిహిత సమాచారం నావద్ద ఉండేది. అలాగే నాకు సంబంధించినవి కూడా అక్షర వద్ద ఉండేవి. కానీ టెక్నాలజీ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా. అక్షర నుంచి నాకు ఏదైనా పర్సనల్ మెసేజ్ వస్తే.. ఆ నిమిషంలోనే డిలీట్ చేస్తా అని తనూజ్ తెలిపాడు. కాబట్టి నేను లీక్ చేసే అవకాశమే లేదని తనూజ్ తెలిపాడు.

చట్టానికి సహకరిస్తా

చట్టానికి సహకరిస్తా

నాకు ఈవిషయంలో ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా చట్టానికి నేను సహకరిస్తా అని తనూజ్ తెలిపాడు. నా వద్ద దాచిపెట్టడానికి ఏమి లేదు. కాబట్టి పోలీసులు ఎప్పుడు ప్రశ్నించినా సమాధానం ఇస్తానని తనూజ్ తెలిపాడు. తనూజ్ తల్లి రతి అగ్నిహోత్రి, కమల్ హాసన్ తో కలసి పలు చిత్రాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X