త్రిషకు ట్విస్ట్ ఇచ్చి ఆఫర్ ఎత్తుకుపోయిన తాప్సీ
తాజాగా త్రిష అవకాశాన్ని తాప్సీ కొట్టుకుపోయింది. ఈ విషయం తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు చిత్రం ఝుమ్మంది నాదంతో తెరపైకి వచ్చి అందర్నీ ఆకట్టుకున్న తాప్సి ఇప్పుడు తమిళ చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆడుగళం చిత్రంలో ధనుష్‌కు జంటగా నటిస్తున్నారు. అనంతరం జీవాకు జంటగా వందాన్ వెండ్రాన్ చిత్రంలో నటించనున్నారు. ఆడుగళం చిత్రంలో మొదట త్రిషను ఎంపిక చేశారు. ఇప్పుడా అవకాశాన్ని తాప్సికి ఇవ్వడం జరిగింది. రాత్రికి రాత్రే ఈ మార్పు ఎలా జరిగిందన్నవిషయంపై రకరకాల గుసగుసలు వినపడుతున్నాయి.హీరో జీవాను వ్యక్తిగతంగా కలవటమే తాప్సీ చేసిన తెలివైన పని అంటున్నారు. ఆమెను అతి దగ్గరగా చూసిన జీవా ప్లాట్ అయి ఈ పాత్రకు నీవే సరిపోతావని చెప్పి దర్శకుడుని ఒప్పించి ఆఫర్ ఇప్పించాడని అంటున్నారు. ఇక మీడియావారు తాప్సీని...త్రిషను తొలగించడానికి మీరే కారణమా అని అడగ్గా ఝుమ్మంది నాదం ఇటీవలే విడుదలైందని, దాన్ని చూసి దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నారని తెలిపారు. ఆడుగుళం చిత్రంలో తన పాత్రలో మొదట త్రిషను ఎంపిక చేసిన విషయం తెలిసిందన్నారు. ఎందుకు మార్చారో తనకు తెలియదని, దర్శకుడు ఆ పాత్రను తాను చేయాల్సిందిగా కోరారని, అందుకు అంగీకరించానని చెప్పారు. అలాగే ప్రస్తుతం తాను ధనుష్‌తో నటిస్తున్నానని, ఆ అనుభవం మరువలేనిదని తాప్సి అన్నారు. మొత్తానికి తాప్సీ కూడా తక్కువదేమీ కాదని నిరూపించుకుంది.


Click it and Unblock the Notifications











