క్యూట్ హీరోయిన్ కోసం షూటింగ్ స్పాట్ చేంజ్ చేసిన డైరెక్టర్..
హీరోయిన్ కోసం ఏకంగా షూటింగ్ లొకేషన్నే మార్చేశాడు ఓ డైరెక్టర్. ఆ హీరోయిన్ సొట్టబుగ్గల తాప్సీ అయితే, ఆ దర్శకుడు కన్నన్. 'ఆడుగలం' చిత్రం తర్వాత తాప్సీ తమిళంలో నటిస్తున్న చిత్రం పేరు 'వందాన్ వెండ్రాన్'. జీవా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పాటల చిత్రీకరణ ఇటీవల న్యూజిలాండ్ లో జరిగింది.అక్కడ ఒక లొకేషన్ లో వాతావరణం మైనస్ డిగ్రీలలో వుండడం వల్ల శరీరం గడ్డకట్టుకుపోయే చలి వుందట.
జీవా సూటు ధరించి వుండడం వల్ల అతనికి ఆ చలి ప్రభావం అంతగా లేదు. కానీ, తాప్సీకి పాటల్లో ఒంటి మీద బట్టలు ఎక్కువగా వుండవు కదా... వున్నవి కూడా బాగా పలుచని ట్రాన్స్ పరెంట్ దుస్తులాయే... దాంతో ఆమె ఆ చలిని తట్టుకోలేక వణికిపోతూ ఇబ్బందిపడిపోతుంటే... చూడలేక షూటింగుని వెంటనే మరో లొకేషన్ కి షిఫ్ట్ చేశాడట దర్శకుడు. తన బాధని అర్ధం చేసుకున్న దర్శకుడికి తాప్సీ థాంక్స్ చెప్పుకుందట!


Click it and Unblock the Notifications











