హీరోకు తేరుకోలేని షాక్ ఇచ్చిన అందాల బొమ్మ తాప్సీ
ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ తాజాగా తమిళ హీరో ధనుష్ కు తేరుకోలని షాక్ ఇచ్చింది. పొల్లాదవన్ వెట్రిమన్ దర్శకత్వంలో రూపొందుతున్న అడుకాలమ్ చిత్రంలో ఆమె ధనుష్ సరసన చేస్తోంది. ఈ షూటింగ్ లో ధనుష్ తన ఐ ఫోన్ లో ఫాంట్స్ వేప్ అనే సాప్టవేర్ వాడుతూండటం తాప్సీ గమనించింది. వెంటనే అతని దగ్గరకు వెళ్ళి ఆ సాప్ట్ వెర్ తను, తన స్నేహితురాలు కలిపి తయారు చేసామని చెప్పింది. దాన్ని ధనుష్ నమ్మలేదు. తాప్సీ తన స్నేహితురాలు చేత కూడా ఫోన్ లో మాట్లాడి చెప్పించింది. అప్పటికీ ధనుష్ తనని ఆట పట్టించుటానికి అని ఫిక్సై నవ్వి కోప్పడ్డాడు. అయితే తాప్సీ ఆ సాప్ట్ వేర్ కొనుగోలు చేసిన సంస్ధ వారికి ఫోన్ చేసి మాట్లాడించింది. అప్పుడు ధనుష్ స్వయంగా తాను ఐ ఫోన్ వారిని సంప్రదించి..వివరాలు తెలుసుకున్నాడు. వారు చెప్పిన దాన్ని బట్టి తాప్సీ డవలప్ చేసిందే అని తేలింది. అంతే ధనుష్ దాదాపు ఓ గంటసేపు పాటు షాక్ లో ఉండిపోయాడట. ఆ తర్వాత తేరుకుని యూనిట్ వారిని పిలిచి ఆ విషయం చెప్పాడుట. అప్పుడు ఈ పంజాబీ ముద్దుగుమ్మ తాను లూధియానాలో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసేదాన్ని అని వివరించింది. ఇక ఈ చిత్రంలో తాప్సీ ఆంగ్లో ఇండియన్ గర్ల్ గా నటిస్తోంది. ఇక తెలుగులో విష్ణు మంచు, ప్రభాస్ సరసన చేస్తోంది.


Click it and Unblock the Notifications











