రజనీకాంత్ స్వయంగా నా దగ్గరకు వచ్చి...తాప్సీ
రజనీకాంత్ స్వయంగా నా దగ్గరికొచ్చి.... యు డిడ్ గుడ్ జాబ్ అని భుజం తట్టి ఆనందపరిచారు. ఆ క్షణంలో నాకు గాల్లో తేలిపోయినట్టు అనిపించింది అంటూ మురిసిపోతూ చెప్పింది తాప్సీ. తాప్సీ నటించిన తమిళ చిత్రం అడుక్కాలం ఈ సంక్రాంతికి విడుదలై మంచి టాక్ తెచ్చుంది. ఈ చిత్రంలో హీరో ధనుష్. దాంతో అతని మామగారు..సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ చిత్రం చూడ్డానికి స్పెషల్ షోకు వచ్చారు. ఆ సందర్భంగా తాప్సీ,ధనుష్ కూడా హాజరయ్యారు. అప్పుడు ఆయన్ని అంత దగ్గరగా చూసిన తాప్సీకి నోట మాట రాలేదుట.
వెంటనే ఎదురెళ్ళి ఆయన్ని స్వయంగా ధియోటర్ లోకి ఆహ్వానించింది. అంతేకాదు ఆయన ప్రక్కనే కూర్చుని సినిమా కూడా చూసింది. ఈ విషయమై ఆమె చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ...లైఫ్‌లో ఆయన్ను చూడ్డం అదే తొలిసారి. అంతటి సూపర్‌స్టార్ అంత సింపుల్‌గా ఉండటం చూస్తే ఆశ్చర్యం అనిపించింది.ఓ సగటు ప్రేక్షకుడిలా సినిమాలో పూర్తిగా లీనమైపోయి చూశారాయన. ఆయన పక్కన కూర్చొని సినిమా చూస్తున్నంత సేపూ... ఆయన్ను చూడ్డమే సరిపోయింది నాకు. పైగా లోలోన కాస్తంత గర్వంగా కూడా ఫీలయ్యాను. అలాగే ఆ రెండు గంటలూ నా జీవితంలో మరచిపోలేనివని అంది.


Click it and Unblock the Notifications











