తాప్సీని ఖుషీ చేసి వదిలాడు
తాప్సీ ఇప్పుడు హ్యాపీ మూడ్ లో ఉంది. కారణం ఆమెకు కొత్త ఆఫర్స్ రావటం కాదు.ఆమె ఫోటోని ఆడియో సీడీ అట్టపై పేయటం. ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ లో చెప్తూ..ఇప్పటికి ఆరు రిలీజ్ లు అయ్యాయి నా కెరీర్ లో..ఇది నా ఏడో రిలీజ్. అయితే ఇప్పటివరకూ నా ఫోటో సీడీ కవర్ మీద కనపడలేదు. ధాంక్స్ డైరక్టర్ కన్నన్ గారూ..అంది. ఆమె ట్వీట్ చూసిన డైరక్టర్ కూడా చాలా హ్యాపీ ఫీలై ఆమెక మెసేడజ్ పెట్టాడని తెలుస్తోంది. ఇక ఇంతకీ ఆ సినిమా ఏమిటీ అంటే జీవా ప్రక్కన చేస్తున్న చిత్రం అది.అందులో ఆమె చాలా కాంప్లికేటెడ్ గర్ల్ గా చేస్తోంది. చిత్రం టైటిల్..వందన్ వేండ్రన్.
తాప్సీకి తెలుగులో ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైనా ఆమెకు ఇక్కడ పెద్ద గుర్తింపు రాలేదు. వీర వంటి పెద్ద సినిమాలు చేసినా గ్లామర్ గర్ల్ గానే ఆమె గుర్తింపు తెచ్చుకుంది. అయితే అక్కడ ఆమె ధనుష్ తో చేసిన ఆడు కాలమ్ చిత్రం మాత్రం క్రిటిక్స్ నుంచి అప్లాజ్స్ రావటంతో ఆమెకు మంచి పాత్రలు వస్తున్నాయి. తెలుగులో ఆమె ప్రస్తుతం గోపీచంద్ సరసన నటిస్తోంది. మొగడు టైటిల్ తో నిర్మితమయ్యే ఆ చిత్రాన్ని కృష్ణవంశీ డైరక్ట్ చేస్తున్నారు. నల్లమలుపు బుజ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











