For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాట్ గ్యాప్ లో తాప్సీ కి ఫుల్లుగా నేర్పుతున్నాడు

  By Srikanya
  |

  చెన్నై : స్టార్ హీరోయిన్ తాప్సీ ఇప్పుడు అజిత్‌ మంత్రాన్ని జపిస్తోంది. నిన్నటి వరకు అజిత్‌ను 'బిల్లా-2' హీరోయిన్ పార్వతి ఓమనకుట్టన్‌ ప్రశంసల వర్షంలో ముంచెత్తగా ఇప్పుడా బాధ్యత తాప్సీ తీసుకున్నట్టుంది. ప్రస్తుతం విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాప్సీ హీరోయిన్ . 'వలై' అని నామకరణం చేశారు.

  ఈ చిత్రం విశేషాలను తాప్సీ వివరిస్తూ... అజిత్‌తో నటించే అవకాశం రావడం చాలా గొప్ప అనుకునేదాన్ని. అది ఎంత నిజమో ఇప్పుడు అర్థమవుతోంది. సహ నటుడు, నటికి ఎంత గౌరవమివ్వాలో ఆయన్ను చూస్తే అర్థమవుతుంది. సాదాసీదాగా ఉంటారు. తన పాత్రలో నటించి వెళ్లిపోదామనే మనస్తత్వం కాదు. ఇతరుల నటనపై కూడా దృష్టిపెట్టి తప్పుంటే దర్శకుడి స్థానంలో సవరిస్తుంటారు. విష్ణువర్ధన్‌ నాకు సన్నివేశం చెప్పిన తర్వాత.. షాట్‌కు వెళ్లే విరామంలో ఎలా నటించాలో అజిత్‌ నేర్పుతున్నారు. మొదట్లో ఆయనతో మాట్లాడేందుకు కూడా భయపడేదాన్ని. ఇప్పుడది తొలగిపోయిందని చెప్పుకొచ్చింది.

  హిట్టు, ప్లాప్ లతో సంభదం లేకుండా తమిళ, తెలుగు భాషల్లో దూసుకుపోతున్న తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ తన వరస ఆఫర్స్ తో తోటి హీరోయిన్స్ కి ఝలక్ ఇస్తోంది. అంతేగాక తన ఎక్సపోజింగ్ తో అందరినీ తన వైపుకు లాక్కుంటోంది. ఆమెకు హిట్టు ఒకటే తక్కువ కానీ...లేకపోతే నెంబర్ వన్ పొజీషన్ లో ఉండేదంటున్నారు. తాజాగా ఆమె వెంకటేశ్ హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'షాడో' లో చేస్తోంది. ఎ యూస్క్వేర్ మూవీస్ పతాకంపై పరుచూరి శివరామప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంచిత్రం దాదాపుగా పూర్తయింది. ఇందులో తాప్సీ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

  'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' తరవాత చెప్పుకోదగిన విజయం ఆమె ఖాతాలో ఒక్కటీ లేకపోయినా ఆమె పరుగు మాత్రం ఆగలేదు. తెలుగులో అవకాశాలు అందుతూనే ఉన్నాయి. ఏదో ఒక సినిమాలో కనిపిస్తూనే ఉంది. తమిళంలోనూ మెరుస్తోంది. హిందీలో అడుగుపెట్టింది. అయితే అందరికీ ఇలాంటి అవకాశాలు రావు. నటనపరంగా పెద్దగా ఆమెకు మార్కులు లేకపోయినా వరస ఆఫర్స్ వెనక రహస్యం ఏమిటీ అంటే.. గ్లామర్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

  English summary
  
 Everyone who has worked with Ajith has acknowledged that Ajith is a gem of a person. The latest to join is Taapsee Pannu. Yes, the actress is completely blown away by Thala's simplicity and dedication. Taapsee also said that Ajith helped her a lot in many scenes and she followed Ajith as he is a great actor. Taapsee has been acting with Ajith for the untitled Vishnuvardhan film. The crew is currently in Dubai for the shoot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X