సూపర్ స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిన తాప్సీ
ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ కి ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ గా వెలుగుతున్న సూర్య సరసన ఆఫర్ వచ్చిందని సమాచారం. కేవీ.ఆనంద్ దర్శకత్వం లో రూపొందే ఈ చిత్రం టైటిల్ మాట్రాన్. మాట్రాన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందులో సూర్య ఐదు గెటప్‌లలో కని పించనున్నారని సమాచారం. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రానటువంటి విభిన్న కథాం శంతో తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు కేవీ.ఆనంద్ పేర్కొన్నారు. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆడుగళం లో నటించి అందరి ప్రశంసలు పొందిన తాప్సీ ఇందులో మంచి పాత్ర కొట్టేశారని తమిళ చిత్రపరిశ్రమలో వినపడుతోంది. రెండో సినిమాకే సూర్య వంటి స్టార్ సరసన ఆఫర్ రావటంతో అంతటా ఆమెకు లక్కు తిరిగినట్లే అంటున్నారు. ప్రస్తుతం సూర్య..గజనీ దర్శకుడు...ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో 7 ఆమ్ అరివు చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











