మీడియా తీరుపై తాప్సీ వ్యంగ్యాస్త్రాలు
మీడియా తీరుపై హీరోయిన్ తాప్సీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ఇకపై ఎవరినీ కలవాలనుకున్నా..మీడియా అనుమతి తప్పకుండా తీసుకుంటానంటూ తనతైన రీతిలో ట్విట్టర్ లో స్పందించింది. ఇంతకీ తాప్సీకి మీడియాపై ఇంతలా కోపం రావడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే.....హీరోయిన్ గా ఇంత పెద్ద స్థాయిలో ఉన్న తనకు ఓ చిన్న హీరోతో ఎఫైర్ అంటగడుతూ మీడియాలో కథనాలు ప్రచురితం కావడమే. తమిళ నటులు మన్హత్ రాఘవేంద్ర, కమెడియన్ ప్రేమ్ జీ అమరాన్ తాప్సీకి మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో ఆమె తరచూ వీరితో కలిసి కపిస్తుండటంతో.....తాప్సీ-మన్హత్ మధ్య 'సం"బంధం ఏదో ఉందని గుసగుసలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని పలు ప్రముఖ పత్రికలు ప్రస్తావించాయి. దీంతో మీడియా తీరుపై సీరియస్ అయిన అమ్మడు ఇకపై ఎవరిని కలవాలన్నా మీడియా అనుమతి తీసుకుంటానంటూ వ్యంగ్యంగా తన ట్విట్టర్ లో పేర్కొంది.
'ఝుమ్మంది నాదం" సినిమా ద్వారా సౌత్ సినిమాల్లో ఆరంగ్రేటం చేసిన తాప్సీ ఆ సినిమా పెద్దగా విజయంసాధించక పోయినా హీరోయిన్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. సెంకండ్ హీరోయిన్ పాత్రలు చేయడానికి వెనకాడకుండా...మెల్లి మెల్లిగా తన ప్రాభవాన్ని పెంచుకుంది. తద్వారా మెయిన్ హీరోయిన్ పాత్రలను చేజిక్కించుకుంటోంది. ప్రస్తుతం తాప్సీ టాలీవుడ్, కోలీవుడ్ లలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఆమె నటించి వచ్చాడు-గెలిచాడు తెలుగు, తమిళ వర్షన్ లలో విడుదల కాగా, తెలుగులో కృష్ణవంశీ రూపొందిస్తున్న 'మొగుడు" చిత్రంలో గోపీచంద్ సరసన లీడ్ రోల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











