మహేష్ కొత్త సినిమాలో హాట్ స్టార్ తాప్సీ కి ఛాన్స్ !?
మహేష్, శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న త్రీ ఇడియట్స్ రీమేక్ లో హాట్ స్టార్ తాప్సీకి సెకెండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. ఒరిజనల్ త్రీ ఇడియట్స్ లో ఇద్దరు హీరోయిన్స్ లేరు. కరీనా కపూర్ మాత్రమే అమీర్ కి జోడిగా కనిపిస్తుంది.కరీనా పాత్రకు ఆల్రెడీ ఇలియానాని ఎంపిక చేసారు. అయితే తెలుగు, తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని శంకర్ స్క్రిప్టులో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సెకెండ్ హీరోయిన్ పాత్రను సినిమాకు కలిపినట్లు చెప్తున్నారు. మాధవన్ పాత్ర చేస్తున్న జీవాకు ఈ హీరోయిన్ ఉండబోతోంది. ఇక ఝుమ్మందినాదం చిత్రంతో పరిచయమైన తాప్సీకి ఇందు నిమిత్తం ఫోటో షూట్ కూడా చేసినట్లు, అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదని చెన్నై మీడియా అంటోంది. ఇక తమిళంలో విజయ్..అమీర్ చేసిన పాత్రను చేస్తారు. అలాగే ఈ చిత్రంలో నెగిటివ్ పాత్ర ప్రిన్సిపాల్ వైరస్ గా చేసిన బొమన్ ఇరాని పాత్రను తమిళ నటుడు సత్యరాజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











