తాప్సీ అందాలు తగ్గించుకుంది
నేను ఈ చిత్రంలో ఆర్కిటెక్ గా కనిపిస్తాను.పాత్ర ప్రకారం నేను చాలా స్లిమ్ గా ఉండాలి. అందుకే కష్టపడి చాలా పౌండ్స్ తగ్గాను. మా డైరక్టర్ కి నా కొత్త రూపు తెగ నచ్చేసింది. అయినా మహారాష్ట్ర, కేరళ, పాండిచ్చేరి అంటూ షటిల్ సర్వీస్ చేస్తూంటే దానంతట అదే ఒళ్ళు తగ్గిపోయింది అంది నవ్వుతూ. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తమిళ చిత్రం వచ్చాడు.. గెలిచాడు కోసం ఆమె దర్శకుడు సూచనల మేరకు బరువు తగ్గే పోగ్రాం పెట్టుకుంది. ఈ చిత్రంలో ఆమె జీవా సరసన చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. థమన్ మెలోడీ ప్రధానంగా చక్కటి బాణీలను అందించాడు. గోవా, స్విట్జర్లాండ్ లలో పాటల్ని చిత్రీకరించారు. సినిమాలోని కీలక ఎపిసోడ్ ను ముంబయ్ లో చిత్రీకరించారు. ఈ నెల రెండోవారంలో ఆడియో విడుదల చేసి సెప్టెంబర్ లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.కణ్ణన్.


Click it and Unblock the Notifications











