మంచి చేస్తుంటే టార్గెట్ చేస్తున్నారు... దేవుడు, నిజం నా పక్షమే: విశాల్

తమిళ నిర్మాతల మండలిలో వివాదం రోజు రోజుకు ముదురుతోంది. రెండు వర్గాలుగా చీలిన నిర్మాతలు... ఒకరిపై ఒకరు కారాలు మిర్యాలు నూరుకుంటున్నారు. చైర్మన్ పదవిలో ఉన్న విశాల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవి నుంచి దింపేందుకు ప్రత్యర్థి వర్గం ప్రయత్నాలు చేస్తోంది.

విశాల్ అండ్ టీమ్ తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ భారతీరాజా నేతృత్వంలోని వ్యతిరేక వర్గం బుధవారం కార్యాలయానికి తాళాలు వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గురువారం ఆ తాళాలు పగలగొట్టడానికి విశాల్ ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు.

నిన్న పోలీసులు చోద్యం చూశారు: విశాల్

నిన్న పోలీసులు చోద్యం చూశారు: విశాల్

ఈ పరిణామాలపై విశాల్ స్పందించారు. పోలీసులు నిన్న అనధికార వ్యక్తులు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యాలయానికి తాళాలు వేస్తుంటే చోద్యం చూశారని, చైర్మన్‌గా ఉన్న నేను నా టీమ్ ఆ తాళం తీస్తుంటే అరెస్ట్ చేశారని మండి పడ్డారు.

 మంచి చేస్తుంటే టార్గెట్ చేస్తున్నారు

మంచి చేస్తుంటే టార్గెట్ చేస్తున్నారు

సర్వం కోల్పోయిన నిర్మాతలకు మంచి చేస్తున్నాననే కారణంతో నన్ను టార్గెట్ చేస్తున్నారని, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను చేసే మంచి పనులను ఆపలేరని విశాల్ తెలిపారు. నేను చేస్తున్నది మంచే అని నాకు తెలుసు... దేవుడు, నిజం నా పక్షానే ఉంది, మేము చేస్తున్న దాంట్లో ఏ మార్పు ఉండదు, వెనక్కితగ్గే ప్రసక్తే లేదని విశాల్ ట్వీట్ చేశారు.

ఆ కార్యక్రమాన్ని ఎవరూ అడ్డుకోలేరు

ఆ కార్యక్రమాన్ని ఎవరూ అడ్డుకోలేరు

నిధుల సమీకరణలో భాగంగా ఇళయరాజా సర్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దీన్ని ఆపేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరు. ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమే అని విశాల్ స్పష్టం చేశారు.

విశాల్‌ను దెబ్బకొట్టేందుకు

విశాల్‌ను దెబ్బకొట్టేందుకు

విశాల్‌ను దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థి వర్గం అసంబద్దమైన ఆరోపణలు చేస్తుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. పైరసీకి వ్యతిరేకంగా విశాల్ పోరాటం చేస్తుంటే.... పైరసీ వెనక అతడే ఉన్నట్లు తప్పడు ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X