తమిళంలోకి ప్రభాస్ ఎంట్రీ కన్ఫర్మ్
సముద్రఖని దర్శకత్వంలో ప్రభాస్ ఓ తమిళ చిత్రం చేయనున్నారనే వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడవి నిజమేనని దర్శకుడు సముద్రఖని కన్ఫర్మ్ చేసారు. ఆయన తాజాగా తమిళ మీడియాతో మాట్లాడుతూ...నేను తెలుగులో శంభో శివ శంభో పేరుతో నాడోడిగల్ రీమేక్ చేసాను. అలాగే శశికుమార్(సుబ్రమణ్యపురం ఫేమ్) హీరోగా చేస్తూ నిర్మిస్తున్న ఓ చిత్రం చేస్తున్నాను. అది జూన్ నెల నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. నేను ఆ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కూడా చేస్తున్నాను. ఇక వచ్చే సంవత్సరం ప్రారంభంలో తెలుగు,తమిళ్ లో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నాను. తెలుగు హీరో ప్రభాస్ ని తమిళంకు పరిచయం చేస్తున్నాను. ఆ కథకి స్క్రిప్టు వర్క్ చేస్తున్నాను. స్క్రీన్ ప్లే, డైలాగులు అందించే ఈ కథకి మూలం శివ అనే నవల..దానిని ఇందిరా సౌందర్యరాజన్ రాసారు అని వివరించారు. అంటే వచ్చే సంవత్సరం ప్రభాస్...తమిళంలో ఎంట్రీ ఇస్తారన్నమాట. ప్రస్తుతం ప్రభాస్..కరుణాకర్ దర్సకత్వంలో చేసిన డార్లింగ్ చిత్రం రిలీజుకు రెడీగా ఉంది. అలాగే దశరధ్ దర్సకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











