ఫెస్టివల్స్ ను తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్లక్ష్యం చేస్తోంది
చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలుగు చిత్రాలు ప్రదర్శనకు నోచుకోకపోవడం విచారకరమని ప్రముఖ నిర్మాత, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్యమండలి మాజీ కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నెల 15న చెన్నైలో జరగనున్న చెన్నై ఎనిమిదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలుగు చిత్రాలను నమోదు చేసుకోవలసిందిగా తెలుగు ఫిలిం చాంబర్‌కు లేఖ రాసినా స్పందన రాకపోవడం విచారకరమన్నారు. ఈ చిత్రోత్సవంలో తమిళ చిత్రాలతో పాటు 64 దేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శింపబడుతున్నాయని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలపై ఆసక్తి చూపడం లేదని అన్నారు. గోవాలో జరిగిన చిత్రోత్సవంలోనూ తెలుగు చిత్రాల ప్రదర్శన లేకపోవడం తీరని లోటుగా భావిం చారు. 15వ తేదీ నుంచి చెన్నైలో ప్రారంభంకానున్న చెన్నై ఎనిమిదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఒర్ ఇరవు, నందలాలా తదితర 12 తమిళ చిత్రాలు ప్రదర్శించనున్నారు. ఈ కమిటీలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, చారుహాసన్, నటిఅర్చన సభ్యులుగా ఉంటారు.


Click it and Unblock the Notifications











