మాజీ భార్యతో కమెడియన్ వివాదం.. ఇకపై వారానికి ఒకసారే!
తమిళ నటుడు తాడి బాలాజీ, అతడి భార్య నిత్య మధ్య చాలా గొడవలు జరుగిగాయి. ఒకరిపై ఒకరు పోలీస్ కంప్లంట్, కేసులు పెట్టుకోవడంతో వీరి మధ్య కొనసాగుతున్న వివాదం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. తన భర్త వల్ల తాను ఎదుర్కొంటున్న చిత్ర హింసలు, ఇబ్బందులను కొన్ని రోజుల క్రితం నిత్య మీడియాకు వెల్లడించారు. ఈ పరిణామాలు చివరకు వారు విడిపోవడానికి కారణం అయ్యాయి.
భార్యతో విడిపోవడానికి ఇష్టపడని బాలాజీ... ఆమెతో కలిసి కమల్ హాసన్ హెస్ట్ చేసిన 'బిగ్ బాస్ సీజన్ 2'లో పాల్గొన్నారు. ఈ షో తర్వాత ఇద్దరూ కలుస్తారని అంతా భావించారు. కానీ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. గొడవలు మరింత ఎక్కువయ్యాయి.
కొన్ని రోజుల క్రితం కూతురు పోషికను తన కస్టడీకి అప్పగించాలని బాలాజీ కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ వివాదంపై తీర్పు వచ్చింది. పోషిక తల్లి వద్దే పెరుగుతుందని, వారానికి ఒకసారి కూతురుని కలవడానికి బాలాజీ వీలు కల్పించింది న్యాయస్థానం. పోషిక తల్లి ఇంట్లోనే బాలాజీ తన కూతురును మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య కలవాలని సూచించింది.

ఇద్దరి మధ్య వివాదం విషయానికొస్తే.. బాలాజీ తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని, అతడికి ఓ భార్య, కుమారుడు ఉన్న విషయం తనకు తర్వాతే తెలిసిందని, అయినా సరే అడ్జస్ట్ అయి జీవించానని, అయినా తనను తీవ్రంగా హింసించే వాడని నిత్య గతంలో ఆరోపించారు.
తన భార్యకు ఫేస్‌బుక్ ద్వారా ఒక జిమ్ శిక్షకుడు పరిచయం అయ్యాడని, అతని ప్రవర్తన నచ్చక తన భార్యను హెచ్చరించానని, అయినా తను నా మాట వినలేదని అన్నారు. అప్పటి నుంచి తమ కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయని బాలాజీ ఆరోపించారు.


Click it and Unblock the Notifications











