Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మోసం చేశాడు, చిత్రహింసలు పెడుతున్నాడు: నటుడి భార్య కంప్లయింట్
నటుడు తాడి బాలాజీపై అతడి భార్య నిత్య ఫిర్యాదు చేసింది. బాలాజీ తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని తెలిపారు.
తమిళ నటుడు తాడి బాలాజీపై ఆయన భార్య నిత్య పోలీస్ కమీషనర్‌కు కంప్లైంట్ చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ తన భర్త వల్ల తాను ఎదుర్కొంటున్న చిత్ర హింసలు, ఇబ్బందులను మీడియా ముందు ఏకరవుపెట్టుంకుంది.
తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని.... బాలాజీతో పెళ్లయిన తర్వాతే అతడికి ఇప్పటికే పెళ్లయి ఓ భార్య, కుమారుడు ఉన్న విషయం తెలిసిందని, అయినా సరే అడ్జస్ట్ అయి జీవించానని నిత్య తెలిపారు.
కొన్ని రోజులుగా తన భర్త తనను తీవ్రమైన చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, తాగొచ్చి కొడుతున్నాడని, గత నెలలో అతడి వల్ల తీవ్రగాయాపాలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపారు. విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
తాను ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చి దాడి చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు. అతడి వల్ల రెండు మూడు చోట్ల పని మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. తన భర్త నుండి తనను కాపాడాలని నిత్య చెన్నై పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది.