For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజిత్ మొదలెట్టబోతోన్నాడు.. ఇక మళ్లీ బాక్సాఫీస్ షేక్

    |

    తమిళ నాట మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. అభిమానులంతా తల అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. అజిత్, విజయ్ సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయంటే ఇక ఆ రోజ మహా సంగ్రామమే. సోషల్ మీడియాలో అయితే బాహాటంగానే వీరిద్దరి ఫ్యాన్స్ కొట్టుకుంటూ తిట్టుకుంటూ హద్దులు మీరుతుంటారు. పని గట్టుకుని అవతలి హీరోను డీగ్రేడ్ చేసేలా ట్వీట్లతో ట్రెండ్ అయ్యేట్టు చేస్తారు.

    రీసెంట్‌గా అజిత్ పింక్ రీమేక్ నేర్కొండ పార్వై చిత్రంతో తన అభిమానులను పలకరించిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చే మాస్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. బోనీ కపూర్ నిర్మాణంలో హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసింది. మళ్లీ ఇదే కాంబోలో మరో నూతన చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య పూజా కార్యక్రమాలు కూడా కానిచ్చేశారు.

    Thala Ajith 60th Movie Valimai Shooting Starts Soon

    వలిమై అనే టైటిల్‌తో పూజా కార్యక్రమాలు చేసిన రోజు.. లక్షల ట్వీట్లతో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. వలిమై అనేది జాతీయ స్థాయిలో ట్రెండ్ అవ్వడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెలలో మొదలుకానుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరడంతో వచ్చే నెల మూడవ వారం నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సమాచారం. ఈ సినిమాలో అజిత్ డ్యూయల్ రోల్ చేయబోతోన్నట్లు టాక్. ఒక పాత్రలో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం.

    English summary
    Thala Ajith 60th Movie Valimai Shooting Starts Soon. Valimai Pooja Ceremony Pic Goes Viral. It Is Named As Valimai And Produced By Boney Kapoor. Directed By H vinoth. Regular Shooting May Starts In December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X