అలా టైటిల్ ప్రకటించేశారు.. ఇలా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.. అదే అతడి రేంజ్
తలా అజిత్.. తమిళనాట సంచలనంగా మారిన పేరు అది. కేవలం తమిళ నాట మాత్రమే కాదు.. దేశవిదేశాల్లో అతని అభిమానులు ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్.. తన 60వ చిత్రాన్ని ప్రారంభించేశాడు.
బాలీవుడ్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని తమిళ్‌లో నేర్కోండ పార్వైగా తెరకెక్కించారు. అక్కడ అమితాబ్ పోషించిన పాత్రను తమిళ్‌లో అజిత్ పోషించాడు. బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.
మళ్లీ ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా పట్టాలెక్కింది. బోనీ కపూర్ నిర్మాణంలో, హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 60వ చిత్రం తెరకెక్కబోతోంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలను శుక్రవారం జరిగాయి. ఈ మూవీ టైటిల్‌ను 'వలిమై'గా ఫిక్స్ చేశారు.

టైటిల్‌ను ఖరారు చేశారో లేదో.. కొన్ని గంటల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దాదాపు రెండు మిలియన్ల ట్వీట్లతో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో మొదలుకానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తుండగా.. నీరవ్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు. పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











