ఈ వయసులో ఆ హీరో.. రోజుకు ఐదు గంటల పాటు అదే పనట..

By Kalyan

తమిళ నాట హీరోలను వెండితెరపై నటులుగా కాదు.. గుడిలోని దేవుళ్లుగా కొలుస్తారు. అందుకే అక్కడ హీరో హీరోయిన్లకు గుళ్లు కడుతుంటారు వారు అభిమానులు. అక్కడి హీరోలు కూడా వారి అభిమానులను ప్రాణ సమానులుగానే చూస్తుంటారు. బయట ఫ్యాన్స్ ఎంత గందరగోళ పరిస్థితులు సష్టించినా.. వారు మాత్రం ఆప్యాయంగానే పలకరిస్తూ ఉంటారు.

ప్రస్తుతం తలా అజిత్.. ఇళయ దళపతి విజయ్ హవా..

ప్రస్తుతం తలా అజిత్.. ఇళయ దళపతి విజయ్ హవా..

ప్రస్తుతం తమిళ నాట తలా అజిత్, ఇళయ దళపతి హవా నడుస్తోంది. రజనీ, కమల్ హాసన్ శకం కొనసాగుతూ ఉన్నా.. వీరు ప్రస్తుతం దూసుకుపోతున్నారు. కలెక్షన్లలో మాత్రం టార్గెట్లు పెట్టుకుంటున్నారు. వంద కోట్లను దాటేసినా ఈ హీరోలు.. రెండు వందల కోట్లను కూడా ఈజీగా కలెక్ట్ చేసేస్తున్నారు. వీరి సినిమాలో పోటీ పడ్డాయంటే.. అక్కడ అభిమానుల మధ్య ఘర్షణ కావాల్సిందే.

నేర్కొండ పార్వై, విశ్వాసం చిత్రాలతో జోష్ మీదున్న తలా..

నేర్కొండ పార్వై, విశ్వాసం చిత్రాలతో జోష్ మీదున్న తలా..

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన విశ్వాసం మాస్ ఏరియాలో దుమ్ము లేపింది. నయన తార హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రెండు వందల కోట్లను కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రాన్ని.. తమిళ్లో నేర్కొండ పార్వైగా తెరకెక్కించారు. అక్కడ అమితాబ్ పోషించిన పాత్రను ఇక్కడ అజిత్ అద్భుతంగా పోషించాడని కామెంట్లు వచ్చాయి. ప్రత్యేక ఆకర్షణగా విద్యా బాలన్ నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

నేర్కొండ పార్వై కాంబినేషన్లో మరో సినిమా

నేర్కొండ పార్వై కాంబినేషన్లో మరో సినిమా

బోనీ కపూర్ నేర్కొండ పార్వై చిత్రాన్ని నిర్మించగా.. హెచ్. వినోద్ తెరకెక్కించారు. అజిత్ నటించనున్న ఈ అరవయ్యో చిత్రానికి ఎన్నో ప్రత్యేకతలున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అజిత్ ను చూసి అభిమానులు ఆశ్చర్య పోతారని అంటున్నారు.

రోజుకు ఐదు గంటల పాటు వ్యాయామం..

రోజుకు ఐదు గంటల పాటు వ్యాయామం..

అజిత్ సినిమా కోసం ఎంత కష్టపడతాడో అందరికీ తెలిసిందే. పాత్రకు తగ్గట్టు తన బాడీని మార్చుకునేందుకు ఎంతైనా కష్టపడతాడు. ఈ వయసులో వివేగం లాంట సినిమాకు బాడీని ఫిట్ గా మెయింటెన్ చేశాడు. తన తదుపరి చిత్రం కోసం మరింత కష్టపడుతున్నట్లు సమాచారం. రోజుకు ఐదు గంటల పాటు వర్కౌట్లు చేస్తూ.. బిజీగా ఉన్నాడని కోలీవుడ్లో టాక్. డిసెంబర్లో షూటింగ్ మొదలై.. వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానున్నట్లు సమాచారం. ఇక తమ అభిమాన నటుడిని కొత్త కోణంలో చేస్తే అభిమానులకు ఇక పండగే అన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X