అజిత్ ఫ్యాన్స్‌కు షాక్.. షూటింగ్‌లో గాయాలు
తమిళ నాట అజిత్‌కు ఉండే మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస హిట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న అజిత్.. చివరకు పింక్ రీమేక్‌తో అదరగొట్టాడు. నేర్కొండ పార్వైగా తెరకెక్కించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. మళ్లీ అదే కాంబినేషన్‌లో అజిత్ మరో చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.
బోనీ కపూర్ నిర్మాణంలో హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని నేర్కొండపార్వైను తెరకెక్కించిన సంగతి తెలిసింది. మళ్లీ ఇదే కాంబోలో మరో నూతన చిత్రాన్ని చేస్తున్నాడు అజిత్. వలిమై అంటూ టైటిల్ టైటిల్ ప్రకటించి.. డిసెంబర్‌లో షూటింగ్ కూడా మొదలెట్టేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

అజిత్ యాక్షన్ సీక్వెన్స్‌ను డూప్ సహాయం లేకుండా చేస్తాడన్న సంగతి తెలిసిందే. అజిత్ స్వతహాగా బైక్ రేసర్ కూడా. అయితే తాజాగా వలిమై షూటింగ్ జరుగుతుండగా.. బైక్ యాక్షన్ సీక్వెన్స్‌లో అజిత్‌కు గాయాలైనట్టు తెలుస్తోంది.
అయినా సరే షూటింగ్‌కు ఆటంకం కలగకూడదని పూర్తి చేశాడట. అనంతరం ఆసుపత్రికి వెళ్లగా కొద్ది రోజులు విరామం తీసుకోవాలని సలహా ఇవ్వడంతో.. షెడ్యూల్ వాయిదా పడ్డట్టు సమాచారం. తదుపరి షెడ్యూల్ కోసం అజిత్ హైద్రాబాద్ రానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











