twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజిత్ వచ్చేస్తున్నాడు, రజినీ కూడా : తమిళ రాజకీయాల్లో పెనుమార్పులకు రంగం సిద్దం ?

    ఇప్పుడు కూడా సెల్వం బాధ్యతలు స్వీకరించినా రానున్న ఎన్నికల్లో పార్టీని లీడ్ చేసేది మాత్రం అజేతేనని అంటున్నారు. ఎందుకంటే..

    |

    గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్ననే మరణించి తమిళ ప్రజలను దుఖంలో ముంచేసిన జయ తన వారసుణ్ని ముందుగానే ఎంచుకున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. తన వీలునామాలో అజితే తన వారసుడని రాసుకున్నట్లు చెపుతున్నారు. అమ్మకు నమ్మిన బంటు దగ్గర ఆ వీలునామా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలోనే కాక, కొన్ని వార్తా సంస్థలు కూడా అజిత్ కుమారే జయ వారసుడని పేర్కొంటున్నాయి.ఇప్పుడు కూడా సెల్వం బాధ్యతలు స్వీకరించినా.. రానున్న ఎన్నికల్లో పార్టీని లీడ్ చేసేది మాత్రం అజితేనని అంటున్నారు.

    ఎందుకంటే.. సెల్వం కు అంతగా ప్రజాకర్షణ లేకపోవడంతో ఆ బాధ్యతలు అజిత్ కే అప్పచెప్పడం మంచిదనే అభిప్రాయం సీనియర్ నేతల్లో ఉందంట. అందుకోసం ఇప్పటినుంచే అజిత్ కు రాజకీయం నేర్పాలని వారి అభిప్రాయం. అయితే అటూ అజిత్ కు తమిళనాడులో మాములు క్రేజ్ కాదు. రజినీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరో అజిత్ . మిస్టర్ క్లీన్ పేరున్న వ్యక్తి. అందుకే అమ్మ అజిత్ ను ఎంచుకుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఊహాగానాలు ఎలా ఉన్నా.. అమ్మ నిజంగానే వీలునామాలో అజిత్ పేరు రాసిందా అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ ఇప్పటికే కొన్ని పత్రికలు అజిత్ రాక పక్కా అని ధృవీకరిస్తూ కథనాలను రాయటం ప్రజల్లో విపరీతమైన ఆసక్తిని రేపుతోంది. అంతే కాదు ఇప్పుడు ఇంకో షాకింగ్ న్యూస్ ఏమిటంటే త్వరలోనే రజినీ కూడా బీజేపీ తో చేతులు కలపబోతున్నాడనేది విశ్వసనీయంగా వినిపిస్తున్న మాట... ఈ వార్తలపై ఒక ఫోకస్...

    అజిత్‌:

    అజిత్‌:

    సినీ హీరోగా అజిత్‌కు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. పైగా వివాదరహితుడు, సేవాతత్పరుడేకాక సీఎం జయలలితను కన్నతల్లిగా భావిస్తారు. ఇదే విషయాన్ని పలు వేదికలపై బాహాటంగా చెప్పారు కూడా. ఆసుపత్రిలో చేరడానికి చాలా రోజుల ముందే అజిత్‌ను ఇంటికి పిలిపించుకున్నారు జయ..

    అజిత్‌ను వారసుడిగా:

    అజిత్‌ను వారసుడిగా:

    ఏఐడీఎంకే పార్టీ వాస్తవ పరిస్థితులు, భవిష్యత్ నిర్మాణం తదితర విషయాలపై చర్చించినట్లు ప్రచారం సాగుతోంది. అన్ని విషయాలు ఆలోచించాకే జయ.. అజిత్‌ను వారసుడిగా ఎంపికచేసుకున్నారని, ఈ మేరకు వీలునామాలో రాసి ఉంచారని, ఇప్పుడా వీలునామా జయకు అత్యంత నమ్మకస్తులైనవారి దగ్గరుందని పలువురు చర్చించుకుంటున్నారు.

    పన్నీర్ సెల్వం:

    పన్నీర్ సెల్వం:

    అంతేకాదు.. అజిత్ ఎంపిక పార్టీలోని పెద్దలందరికీ సమ్మతమేనని తెలుస్తోంది. గతంలో రెండు సార్లు అమ్మ కోసం ముఖ్యపదవిని చేపట్టిన పన్నీర్ సెల్వం పట్ల ఎలాంటి వ్యతిరేకత లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టడానికి ఆయనకున్న జనాకర్షణ సరిపోదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే చాలామంది అజిత్ వైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

    జయలలిత వారసుడుగా అజిత్:

    జయలలిత వారసుడుగా అజిత్:

    జయలలిత మరణం తరువాత ఆమె వారసుడుగా పన్నీరు సెల్వం అధికారం చేపట్టినా మరి కొద్ది రోజులలో జయలలిత వారసుడుగా కోలీవుడ్ హీరో అజిత్ మారబోతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియా కొన్ని ఆసక్తికర కథనాలను ప్రచారంలోకి తీసుకు వస్తోంది. ఈ వార్తలలో ఎన్ని నిజాలో ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా ఈ గాసిప్పులు మాత్రం మీడియాను షేక్ చేస్తున్నాయి.

    ఆసక్తికర కారణం:

    ఆసక్తికర కారణం:

    ఇప్పటికే రాజకీయపరంగా జయలలిత వారసుడిగా పన్నీరు సెల్వం ఓకే అయిన తరువాత ఇలాంటి వార్తలు జోరందుకోవడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది. హీరో అజిత్ జయలలితను ‘అమ్మ'అని పిలవడమే కాకుండా పొయెస్‌ గార్డెన్‌కు నేరుగా వెళ్ళగలిగే అతికొద్ది వ్యక్తులలో అజిత్ ఒకడు అన్న ప్రచారం జరుగుతోంది.

    ప్రచారం మొదలు పెట్టారు:

    ప్రచారం మొదలు పెట్టారు:

    ప్రస్తుత పరిస్థుతులలో అన్నాడీఎంకే చీలిపోకుండా యథాతథంగా కొనసాగాలన్నా డీఎంకేకు గట్టి పోటీ ఇవ్వాలన్నా అజిత్ లాంటి వ్యక్తిని తెరపైకి తీసుకురావడమే మంచిది అన్న అభిప్రాయంతో కొందరు అన్నాడీఎంకే లోని కొందరు వ్యక్తులు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు అన్న వార్తలు కోలీవుడ్ మీడియాలో ఊపందుకున్నాయి.

    ప్రజాదరణ :

    ప్రజాదరణ :

    డీఎంకేలో స్టాలిన్‌ లాంటి బలమైన నాయకుడుని ఢి కొట్టాలి అంటే అది తమిళనాట అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక్క అజిత్ కు మాత్రమే సాధ్యమయ్యే పని అంటూ కోలీవుడ్ మీడియా కొత్త ప్రచారాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

    కోలీవుడ్ మీడియా:

    కోలీవుడ్ మీడియా:

    దీనికితోడు తన మరణానంతరం పన్నీరుసెల్వం ముఖ్యమంత్రిగా ఉండాలని వచ్చే ఎన్నికల నాటికి అజిత్‌ను బలమైన నాయకుడిగా తయారుచేయాలని ఆసుపత్రికి వెళ్లకముందే పార్టీ వర్గాల్ని జయ ఆదేశించినట్లుగా కోలీవుడ్ మీడియాలోని కొన్ని వర్గాలు ఇప్పుడు సరికొత్త చర్చలకు తెర లేపుతున్నాయి. దీనిని బట్టి చూస్తూ ఉంటె త్వరలో అజిత్ తమిళ రాజకీయాలలో ప్రవేసించి అన్నాడీఎంకెలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని అనిపిస్తోంది.

    రజినీకాంత్ ను:

    రజినీకాంత్ ను:

    మరొకవైపు భారతీయ జనతా పార్టీ కూడ ఏదోవిధంగా రజినీకాంత్ ను తమ పార్టీలో చేరేలా ఒప్పించి ఆయన క్రేజ్ ను ఉపయోగించుకుంటూ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకోవాలని ప్రయత్నాలు కూడ మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఏమైనా జయలలిత మరణంతో తమిళ రాజకీయాలలో పెను మార్పులు రాబోతున్నాయి అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు..

    అవినీతి ఆరోపణలు:

    అవినీతి ఆరోపణలు:

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత దక్షిణాదిలో తమిళనాడు అతిపెద్ద రాష్ట్రంగా అవతరించింది. ఈ రాష్ట్రంనికి చెందిన రజనీకాంత్ వంటి ప్రముఖులను పార్టీ లో చేర్చుకోవాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఇందుకోసం ద్రావిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే నేతలు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు.

    రజనీతో సంప్రదింపులు:

    రజనీతో సంప్రదింపులు:

    రాష్ట్రంలో విశేష ప్రజాదరణ ఉన్న రజనీకాంత్ వారితో కలిస్తే, ఎన్నికల్లో తిరుగుండదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి నేతలు అంచనా వేశారు.
    ఇదే విషయంపై మోడీతో పాటు అమిత్ షాలు కూడా రజనీతో సంప్రదింపులు జరిపారు. ఈ పరిస్థితుల్లో గతం లో ‘లింగ' సినిమా షూటింగ్ సమయంలో రజనీని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వ్యక్తిగతంగా కలిశారు.

    సీఎం అభ్యర్థి రజనీ:

    సీఎం అభ్యర్థి రజనీ:

    అదే సమయంలో, అమిత్ షా కూడా రజనీతో ఫోన్‌లో మాట్లాడారట. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసాయి కూడా రజనీని అతని నివాసంలో కలిసి పార్టీలో చేరికపై మాట్లాడారు. బీజేపీ తరపున సీఎం అభ్యర్థి మీరేనంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. దీంతో, బీజేపీలో రజనీ చేరిక ఖాయమని అందరూ భావించారు. కాని రజినీకాంత్ సాగదీత ధోరణిని అవలంభిస్తుండటంతో అమిత్ షా విసిగిపోయినట్లు చెబుతున్నారు.

    కొన్ని నెలలు ఓపిక పట్టమని:

    కొన్ని నెలలు ఓపిక పట్టమని:

    కొన్ని నెలల క్రితం చెన్నైకి వచ్చిన అమిత్ షా ఈ అంశంపై పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. తాను మరోసారి చెన్నై రాకముందే రజనీ తన నిర్ణయాన్ని తెలపాలని కోరారు. అయితే మరో కొన్ని నెలలు ఓపిక పట్టమని రజనీ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు మళ్లీ సమయం కావాలని కోరడంలో అర్థం లేదని అమిత్ షా అన్నారట.

    సినీ నటుల ప్రవేశం:

    సినీ నటుల ప్రవేశం:

    పార్టీలో చేరాల్సిందింగా రజనీకాంత్‌ను ఎవరూ కూడా కోరవద్దని రాష్ట్ర నేతలకు మౌఖిక ఆదేశాలు జారీచేసారట. రజనీకాంత్ ఇబ్బందికర పరిస్థితుల్లో బీజేపీలోకి రావాల్సిన అవసరం లేదని అమిత్ షా స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తానికి తమిళ రాజకీయాల్లో కి సినీ నటుల ప్రవేశం తమిళనాడు రాజకీయ చిత్రాన్ని మార్పుకు కారణం అవుతుందనే అనిపిస్తోంది.

    English summary
    The Tamil media has reported that Jayalalithaa had already finalised her successor and it is none other than Tamil star Ajith, who is said to share a good relationship with the chief minister.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X