రజనీకాంత్ 167 టైటిల్ కేక.. చాలా రోజుల తర్వాత కరుడగట్టిన ఖాకీగా తలైవా

Recommended Video

Rajinikanth Movie Darbar First Look Poster Unveiled || Filmibeat Telugu

తన కెరీర్‌లో 167 సినిమాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి దర్బార్‌గా నామకరణం చేశారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కీలక పాత్రలో నివేదా థామస్ కనిపిస్తారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే...

ఖాకీ డ్రస్సులో రజనీ

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ రూపొందిస్తున్న దర్బార్ చిత్రంలో రజనీకాంత్ ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఖాకీ డ్రస్సులో సూపర్ స్టార్ కనిపించడం విశేషం. అయితే మళ్లీ ముంబై బ్యాక్ డ్రాప్‌తోనే ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ఫస్ట్‌లుక్‌లో ఆనవాళ్లు కనిపించాయి. ఇంకా టైటిల్ ప్రకటనలో సినిమా గురించి పెద్దగా సమాచారం అందించకపోవడం గమనార్హం.

ద్విపాత్రిభినయంతో తలైవా

ద్విపాత్రిభినయంతో తలైవా

రజనీకాంత్ చాలా రోజుల తర్వాత మళ్లీ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పోలీస్ అధికారిగా, సామాజిక కార్యకర్తగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో మూండ్రూ ముగం, పాండ్యన్, కోడి పరకుతు అనే చిత్రాల్లో పోలీసు పాత్రలో కనిపించారు.

 రజనీ కూతురుగా నివేదా థామస్

రజనీ కూతురుగా నివేదా థామస్

దర్బార్ చిత్రంలో రజనీకాంత్‌కు కూతురుగా నివేదా థామస్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు. అయితే ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన ఫోటోషూట్‌ను నిర్వహించినట్టు తమిళ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే అటు లైకా నుంచి గానీ, నివేదా నుంచి గానీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ వార్త నిజమేనా అనే చర్చ జరుగుతున్నది.

 హీరోయిన్‌గా నయనతార

హీరోయిన్‌గా నయనతార

దర్బార్ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభం కానున్నది. చంద్రముఖి, కుచేలన్, శివాజీలో రజనీకాంత్ కలిసి నటించిన నయనతార ఈ చిత్రంలో హీరోయిన్. సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. వచ్చే ఏడాది పొంగల్‌కు ఈ సినిమా రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X