ట్యాగ్ తొలిగింపుతో, 'తలైవా'(అన్న) కి పరిష్కారం
అయితే చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 'వేందర్ మూవీస్' రాత్రి ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. విడుదలపై సమస్యలను ఎలా పరిష్కరించుకుంది వివరించకపోయినా, ఈ చిత్రం తమిళనాడులోని 500 కేంద్రాల్లో విడుదల కానున్నట్లు పేర్కొంది. 20న విడుదల కానున్నట్లు ప్రచార చిత్రాలను కూడా ఆదివారం రోజున విడుదల చేశారు. అయితే గత ప్రచార చిత్రాల్లో ఉప శీర్షికగా ఉన్న 'టైమ్ టు హెడ్'(నాయకత్వానికి సమయమైంది) పదాన్ని మాత్రం తొలగించారు. దీనికి కారణం... వేందర్ మూవీస్ వారు...తొలిగించమన్నట్లుగా దర్శకుడు మీడియాకు తెలియచేసారు.
ఇక నిన్నటివరకూ హై డ్రామా నడిచింది. తన తాజా చిత్రం 'తలైవా'..(అన్న) విడుదలకు మార్గం సుగుమం చేయాలంటూ ముఖ్యమంత్రికి స్వయంగా విన్నవించుకునేందుకు విజయ్ ప్రయత్నించగా 'అమ్మ' కనీసం అందుకు అనుమతి కూడా ఇవ్వకపోవటం విజయ్ కు షాక్ అయ్యింది అపై చిత్ర నిర్మాత చంద్రప్రకాష్ జైన్, దర్శకుడు ఏఎల్ విజయ్‌లు కమిషనర్‌ను కలుసుకుని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే శనివారం రోజున తలైవా ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది.
విజయ్ అభ్యర్థను తోసిపుచ్చుతూ ఆయన చేపట్టాలనుకున్న దీక్షకు నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై ఘాటుగా స్పందించిన పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రామదాసు, శాంతిభద్రతులు పరిరక్షణ, నేరాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన పోలీసుశాఖ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకే పనిచేస్తోందని, తలైవా చిత్ర విడుదలను కూడా అడ్డుకుంటూ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుందని ఆరోపించారు.


Click it and Unblock the Notifications












