twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి టైటిల్‌తో విజయ్.. వైరల్‌గా మారిన మాస్టర్ ఫస్ట్‌లుక్

    |

    తమిళ సూపర్‌స్టార్, దళపతి విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న దళపతి64 సినిమాపై భారీ అంచనాలు ఇప్పటికే నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రకటన కోసం లక్షలాది మంది అభిమానులు వేచి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా టైటిల్‌ను మాస్టర్‌గా అనౌన్స్ చేశారు. కొత్త సంవత్సరం వేడుక సందర్భంగా ఓ ఫోటోను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే..

     మాస్టర్ పోస్టర్ వైరల్

    మాస్టర్ పోస్టర్ వైరల్

    మాస్టర్ సినిమా టైటిల్‌, పోస్టర్‌ను ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో కుమ్మేశారు. టైటిల్ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఆల్ ఇండియా ట్రెండింగ్‌గా మారింది. ట్విట్టర్‌లో 1000k మంది ట్వీట్ చేశారు. మసక బారిన పోస్టర్‌లో విజయ్ లుక్స్ చాలా ఇంటెన్సివ్‌గా ఉన్నాయి.

     కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌గా

    కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌గా

    మీడియాలో వైరల్ అవుతున్న రూమర్ల ప్రకారం.. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌గా మాస్టర్ తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్‌గా నటిస్తున్నారు అనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ కథ విషయంపై పెదవి విప్పకపోవడం గమనార్హం. గతంలో చిరంజీవి నటించిన మాస్టర్ టైటిల్‌ను విజయ్ తన సినిమాకు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.

     మాస్టర్‌కు విలన్‌గా విజయ్ సేతుపతి

    మాస్టర్‌కు విలన్‌గా విజయ్ సేతుపతి

    మాస్టర్ చిత్రంలో విజయ్‌తో పాటు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రను పోషిస్తున్నారు. అయితే త్వరలో విడుదల చేయబోయే రెండో పోస్టర్‌ విజయ్ సేతుపతి ఫోటోతో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను దర్శకుడు లోకేష్ కనకరాజ్ విభిన్నంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తున్నది.

     2020 ద్వితీయార్థంలో

    2020 ద్వితీయార్థంలో

    కర్ణాటకలోని శివమొగ్గలో సుదీర్ఘమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్న మాస్టర్ చిత్రంలో భారీ తారాగణం పాల్గొన్నది. ఈ చిత్రంలో వినయ్, ఆండ్రియా జెర్మియా, మాలవిక మోహనన్, శంతను భాగ్యరాజ్, గౌరీ కే కిషన్, అర్జున్ దాస్, లింటు రోని తదితరులు నటిస్తున్నారు. 2020 ద్వితీయ భాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

    English summary
    Thalapathy 64 first look: Tamil Superstar Vijay's latest movie's title as Master. This title and first look goes viral after release of few hours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X