Thalapathy 65: మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న విజయ్.. డేట్ ఫిక్స్!
కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యదిక మార్కెట్ తో చక్రం తిప్పుతున్న హీరోల్లో తలపతి విజయ్ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ఆరు సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్స్ తో డామినేట్ చేయగా ఇప్పుడు వారి కంటే ఎక్కువగా విజయ్ రికార్డు స్థాయిలో హిట్స్ బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటున్నాడు.
సంక్రాంతికి వచ్చిన మాస్టర్ సినిమాతో విజయ్ మెల్లగా టాలీవుడ్ పై కూడా తన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ 65వ సినిమా కూడా టాలీవుడ్ లో భారీగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా స్టైలిష్ యాక్షన్ సినిమాగా రాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు.

జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 6గంటలకు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. చూస్తుంటే ఈ సినిమాతో కూడా విజయ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇక విజయ్ త్వరలోనే తమిళ్ తెలుగులో ద్విభాషా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న ఆ సినిమా కోసం విజయ్ దాదాపు 100కోట్ల వరకు పారితోషికం అందుకొనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











