Thalapathy 68: మరోసారి తెరపైకి రాబోతున్న బిగిల్ కాంబినేషన్.. ఈసారి అంతకుమించి అనేలా..

సౌత్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు హీరో హీరోయిన్ అంటే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగి పోతూ ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం దర్శకుడు హీరో కెమిస్ట్రీ వర్కౌట్ అయితే సినిమాలు భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటున్నాయి. ఇక కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడి గా కొనసాగుతున్న అట్లీ తళపతి విజయ్ తో సినిమా చేస్తున్నాడు అంటే అభిమానులలో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని దాటేసున్నాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ స్థాయిలో వసూళ్లు అందుతున్నాయి.

దర్శకుడు అట్లీ అతి చిన్న వయస్సులోనే తన గురువు శంకర్ స్థాయిని అందుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. సాధారణంగా తమిళ ఇండస్ట్రీలో ఒక దర్శకుడు స్టార్ హీరోలతో సక్సెస్ అందుకున్నాడు అంటే చాలు మళ్ళీ వెంటనే వారి కలయికలో మరో సినిమా చేస్తుంటారు. అంతేకాకుండా డిజాస్టర్ వచ్చినా కూడా ఆ దర్శకుడితోనే సినిమా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఇక వరుసగా మూడు బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న అట్లీ విజయ్ కాంబినేషన్ నాలుగోసారి కూడా కలిసి వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. విజయ్ 69వ సినిమా చేయడానికి అట్లీ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

Thalapathy 68 director atlee combo might be joining again in 2023

వీరి కలయికలో మొదట తేరి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మెర్షల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక్కసారిగా వారి స్థాయిని పెంచేలా వసూళ్లను అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన బిగిల్ సినిమా కూడా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో కూడా విజయ్ మార్కెట్ పెరగడానికి అట్లీ సినిమాలు చాలా ఉపయోగపడ్డాయి. ఆ తరువాత కూడా అట్లీ తెలుగులో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. ఇక నాలుగవ సారి ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ లో కలిసి సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ సినిమాను చేస్తున్నాడు.

ఆ సినిమా తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేయనున్నాడు. దిల్ రాజు ఆ ప్రాజెక్ట్ ను నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇక విజయ్ కు రెమ్యునరేషన్ కూడా 100కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక మళ్లీ మాస్టర్ కాంబినేషన్ కూడా తెరపైకి రానుంది. లోకేష్ కనగరాజ్ తో కూడా ఒక సినిమా చేయనున్నాడు. ఇక విజయ్ ఆ తర్వాత ఎవరితో వర్క్ చేస్తాడు అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అట్లీతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. విజయ్ 69వ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఆ సినిమాను అట్లీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరపైకి తీసుకు రానున్నాడు. మరి బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అలాగే అట్లీ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X