లైబ్రరీలో ఆ హీరోయిన్‌తో అలా.. రొమాంటిక్ మూడ్‌లో మాస్టర్

దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ నాట సూపర్ స్టార్ రజినీకి ధీటుగా అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న విజయ్.. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతు దూసుకుపోతూ ఉన్నాడు. సర్కార్, బిగిల్ చిత్రాలతో బాక్సాఫీస్ దుమ్ములేపాడు. కేవలం బిగిల్ చిత్రంతో దాదాపు 300కోట్లు కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మరోసారి బాక్సాఫీస్ పని పట్టేందుకు విజయ్ సిద్దమయ్యాడు.

ఖైదీ సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచిన లోకేష్ కనకరాజ్ విజయ్‌తో మాస్టర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్‌ను సినిమాపై అంచనాలు పెంచేశాయి. దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇద్దరూ తలపడే పోస్టర్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. షూటింగ్ పూర్తయిన సందర్భంగా విజయ్ సేతుపతి, విజయ్‌కు ముద్దు పెట్టిన ఫోటో ఎంతగా హల్చల్ చేసిందో అందరికీ తెలిసిందే.

Thalapathy Vijay And Malavika Mohanan Poster Goes Viral

మాస్టర్ నుంచి విడుదలైన పాటలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. కుట్టి స్టోరీ, వాతికమింగ్ పాటలు యూట్యూబ్‌ను షేక్ చేశాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో మాస్టర్ రొమాంటిక్ మూడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. లైబ్రరిలో హీరోయిన్ మాళవిక మోహనన్‌తో రొమాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X