మెర్సల్ పార్టీ అదిరింది.. రెహ్మాన్, విజయ్, సూర్య రచ్చ రచ్చ
Recommended Video

తమిళంలో మెర్సల్ చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ పార్టీలో మునిగి తేలింది. చెన్నైలో జరిగిన ఈ పార్టీకి మెర్సల్ చిత్రంలో నటించిన విజయ్, ఎస్‌జే సూర్య, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్, దర్శకుడు అట్లీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన సెల్ఫీ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ ఫొటో మీకోసం...

మెర్సల్@200
దీపావళీ పండుగను పురస్కరించుకొని రిలీజైన మెర్సల్ చిత్రం మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళు చేసింది. మూడోవారంలో కూడా మంచి వసూళ్లను సాధిస్తుండటం గమనార్హం.

10 మిలియన్ డాలర్ల మార్క్
మెర్సల్ స్వదేశంలోనే కాకుండా మలేషియా, ఫ్రాన్స్, యూఏఈ, నార్త్ అమెరికాలో భారీ కలెక్షన్లను సాధించింది. రాయిస్, బాహుబలి, దంగల్ తర్వాత ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 10 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది.

చెన్నైలో మెర్సల్ సక్సెస్ పార్టీ
ఈ నేపథ్యంలో దర్శకుడు అట్లీ చెన్నైలో భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తలపతి విజయ్ ఉత్సాహాన్ని చూసిన వారు ఆనందంలో మునిగిపోయారట. విజయ్‌కి ఏఆర్ రెహ్మన్, ఎస్‌జే సూర్య, అట్లీ జతకలవడంతో పార్టీ రచ్చ రచ్చగా మారిందట.

త్వరలో అదిరింది రిలీజ్
జీఎస్టీ, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై వ్యంగాస్త్రం సంధించిన మెర్సల్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం నవంబర్ రెండో వారంలో తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, సమంత తదితరులు నటించారు. అట్టీ దర్శకత్వం వహించిన చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











