లెజెండరీ కమెడియన్‌కు తీవ్ర విషాదం.. కంటతడి పెట్టిన దళపతి విజయ్
తమిళ సినిమా రంగంలో లెజెండరీ కమెడియన్ గౌండమణి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత కొద్ది నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సతీమణి శాంతి తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను తెలుసుకొన్న స్టార్ హీరోలు, ఇతర నటీనటులు ఆయనకు ఓదార్పు అందించే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా వెళ్లి పుట్టెడు విషాదం నుంచి బయటపడేందుకు పరామర్శిస్తున్నారు. ఈ విషాద వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రజనీకాంత్, కమల్ నుంచి తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన గౌండమణి సతీమణి శాంతి వయసు 97 సంవత్సరాలు. తన భర్త కెరీర్‌కు అండదండగా ఉంటూ ప్రోత్సాహం అందించిన ఆమెకు సినిమా ప్రముఖులతో ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. శాంతితో గౌండమణి వివాహం 1963లో జరిగింది. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు సెల్వీ, సుమిత్ర ఉన్నారు.

గౌండమణి సతీమణి శాంతి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో కొద్ది రోజుల క్రితం హాస్పిటల్‌లో చేర్పించారు. వృద్దాప్య పరమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. గత రెండు రోజులుగా ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ వార్త తెలియగానే కమెడియన్ సెంథిల్, నటుడు సత్యరాజ్, దళపతి విజయ్ స్వయంగా వెళ్లి పరామర్శించారు.
సతీ వియోగంతో బాధపడుతున్న గౌండమణిని పరామర్శించేందుకు స్వయంగా ఆయన వెళ్లారు. గౌండమణి నివాసంలో చివరి చూపు కోసం పెట్టిన పార్తీవదేహంపై పుష్పుగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. ఆ తర్వాత గౌండమణిని కలిసి ధైర్యాన్ని చెప్పారు. శాంతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతడిని ప్రార్థించారు. కుటుంబ మనోధైర్యాన్ని కూడగట్టే ప్రయత్నం చేసినట్టు సినీ వర్గాలు వెల్లించాయి. ఈ విషయాన్ని విజయ్ ఫాన్స్ క్లబ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గౌండమణిని పరామర్శించిన ఫోటోను షేర్ చేశారు.
గౌండమణి కెరీర్ విషయానికి వస్తే.. 1970 సంవత్సరంలో రామన్ ఇథనై రమనాడి చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలోకి ప్రవేశించారు. తెనుమ్ పాలుమ్ చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. ఓథా వోటు ముత్తయ్య సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఆయన 300 సినిమాలకుపైగా చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications