దళపతి విజయ్‌కి మరో షాక్.. భార్య విడాకుల వివాదం.. కొడుకు షాకింగ్ డెసిషన్!
దళపతి 'విజయ్'(Thalapathy Vijay) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన పేరు వినపడితే చాలు తమిళ సినీ అభిమానులు పునకాలతో ఊగిపోతారు. ఒక్క తమిళనాడే కాదు ప్రపంచ వ్యాప్తంగా విజయ్ కి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు నిదర్శనం విజయ్ నటించిన 'జననాయగన్' ఆడియో లాంచ్ ఈవెంట్‌ను మలేషియాలోని ఓపెన్ స్టేడియంలో నిర్వహించడమే. అలాంటి క్రేజ్ ఉన్న విజయ్‌కి ఊహించని భారీ షాక్ తగిలింది. విజయ్ భార్య సంగీత తనకు విడాకులు కావాలంటూ కోర్టు ఆశ్రయించింది. ఈ క్రమంలో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఏం జరిగిందంటే?
సెలబ్రిటీల కుటుంబాలకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ వేగంగా వైరల్ అవుతుంటాయి. ఇటీవల హీరో విజయ్ భార్య పేరు సంగీత(Sangeetha). ఆమె విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్ పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పలు మీడియా నివేదిక ప్రకారం.. సదరు పిటిషన్ లో 'విజయ్ కి ఒక నటితో వివాహేతర సంబంధం ఉంది. ఆమెతో రిలేషన్ కి దూరంగా ఉంటాననీ నాకు మాట ఇచ్చాడు. కానీ, తనకు ఇచ్చిన ఆ మాట తప్పి, రిలేషన్ ని కొనసాగిస్తున్నాడు. ఇలాంటి ప్రవర్తన వల్ల గత రెండేండ్లుగా తీవ్ర మానసిక వేదనని అనుభవిస్తున్నాను. ఇప్పుడు వేరే దారి లేక విడిపోవడానికి సిద్ధపడుతున్నానని సంగీత తన విడాకుల పిటిషన్ లో పేర్కొన్నారట. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న విచారణకి హాజరు కావాలని కోర్టు విజయ్ కి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

శ్రీలంక తమిళ మూలాలకు చెందిన సంగీత యునైటెడ్ కింగ్‌డమ్‌లో పెరిగింది. 1999లో విజయ్‌ను వివాహం చేసుకుంది. వారి పరిచయం సినిమా ఇండస్ట్రీ వెలుపలే ప్రారంభమైందని సమాచారం. పూవే ఉనక్కగా (Poove Unakkaga) సినిమా సక్సెస్ ఈవెంట్ లో సంగీత.. విజయ్‌ను తొలిసారి కలిసినట్లు చెబుతారు. ఆ తర్వాత విజయ్ ఆమెను తన ఇంటికి ఆహ్వానించి తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. క్రమంలో వీరి పరిచయం ప్రేమగా మారడం, వీరి అభిప్రాయాన్ని ఇరు కుటుంబాలు అంగీకరించడం. ఇలా 1999 ఆగస్టు 25న సాంప్రదాయ హిందూ విధానంలో వారి వివాహం జరిగింది. తర్వాత చెన్నైలో రిసెప్షన్ నిర్వహించారు. మతపరమైన భేదాలు ఉన్నప్పటికీ వివాహం హిందూ ఆచారాల ప్రకారం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం.
ఇలా దాదాపు 27 ఏండ్లుగా సాఫీగా సాగుతున్న విజయ్ సంగీత సంసారంలో కల్లోలం చెలారేగింది. ఓ ప్రముఖ స్టార్ హీరోయిన్ తో హీరోయిన్ తో విజయ్ కి ఆఫైర్ ఉందని టాక్. ఈ క్రమంలో భార్య సంగీత విడాకుల నోటిస్ పంపగా.. తాజాగా విజయ్ తనయుడు, యంగ్ డైరెక్టర్ జాసన్ సంజయ్ తన తండ్రి విజయ్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, కొంతమంది నెటిజన్లు జాసన్ సంజయ్ అసలు విజయ్ అకౌంట్‌ను ఎప్పుడూ ఫాలో కాలేదని వాదిస్తున్నారు. దీంతో ఈ అన్‌ఫాలో వ్యవహారం నిజమా కాదా అన్నదే క్లారిటీ లేకుండా ఉంది. విడాకుల వార్తలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగంను ప్రారంభించారు. హై-ప్రొఫైల్ పబ్లిక్ ఫిగర్ అయినప్పటికీ, తన వ్యక్తిగత జీవితాన్ని సాధారణంగా బహిరంగ చర్చకు దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు. జాసన్ సంజయ్ అన్‌ఫాలో వివాదం, విడాకుల పిటిషన్ ఆరోపణలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు విజయ్ లేదా సంగీత నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు. కాబట్టి ఈ వార్తలపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. అంతవరకు, సోషల్ మీడియా ఊహాగానాలు మాత్రమే చర్చకు దారి తీస్తున్నాయి.


Click it and Unblock the Notifications











